ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యం... వైద్యం వికటించి ఇద్దరు మహిళల మృతి

By Arun Kumar PFirst Published May 23, 2020, 12:15 PM IST
Highlights

వైద్యం వికటించి ఇద్దరు మహిళలు మృతిచెందిన దుర్ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రాణాలను కాపాడాల్సిన  హాస్పిటల్స్, డాక్టర్లే రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నారు. వైద్యంకోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన ఇద్దరు మహిళల హటాత్తుగా  మృతిచెందారు. వీరి మరణాలకు హాస్పిటల్ యాజమాన్యం, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.  దీంతో  సదరు హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

ఈ విషాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సిరిసిల్ల పట్టణంలోని తేజ  ఆస్పత్రిలో రుద్రంగి మండలం మానాల కు చెందిన షీలా, సిరిసిల్ల పట్టణం లోని గణేష్ నగర్ కు చెందిన కల్పన అనే ఇద్దరు మహిళలు వైద్యం కోసం చేరారు. ఇదే హాస్పిటల్ లో శీల పైల్స్ ఆపరేషన్ కాగా, కల్పనకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగింది.  

అయితే ఆపరేషన్ తర్వాత ఈ ఇద్దరు మహిళలు హటాత్తుగా మృతిచెందారు. హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే వైద్యం వికటించి వీరిద్దరు మృతిచెందారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

read more  బతికుండగానే బావిలో.. గొర్రెకుంట మృతుల పోస్టుమార్టం రిపోర్ట్

హాస్పిటల్ యాజమాన్యానికి రాజకీయ పలుకుబడి ఉండడంతో ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.  ఈ ఘటనపై వెంటనే ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయడమే కాకుండా హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
 

click me!