వివాహితపై న్యూస్ రిపోర్టర్ అత్యాచారం..

Published : Sep 23, 2020, 07:45 AM IST
వివాహితపై న్యూస్ రిపోర్టర్ అత్యాచారం..

సారాంశం

పంజాగుట్టలోని ఓ పత్రికలో రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగేళ్లుగా అతడి ఇంటికి సమీపంలో ఉంటోన్న గృహిణి కుటుంబంతో పరిచయం ఏర్పడింది.   

గృహిణి పై ఓ న్యూస్ రిపోర్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో..  అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దారుణ సంఘటన  హైదరాబాద్ నగరంలోని వనస్థలీపురంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం మాచర్ల గ్రామానికి చెందిన గోరేటి శివప్రసాద్‌(35) వనస్థలిపురంలో నివాసం ఉంటున్నాడు. పంజాగుట్టలోని ఓ పత్రికలో రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగేళ్లుగా అతడి ఇంటికి సమీపంలో ఉంటోన్న గృహిణి కుటుంబంతో పరిచయం ఏర్పడింది. 

ఇటీవల శివప్రసాద్‌ సదరు గృహిణితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమె ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తున్నాడు. ఈ నెల 18న ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌ను పేద‌ల‌కు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు