నాగర్‌కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు దుర్మరణం

Siva Kodati |  
Published : Sep 22, 2020, 09:14 PM IST
నాగర్‌కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు దుర్మరణం

సారాంశం

నాగర్ కర్నూల్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆమ్రాబాద్ మండలం ఈగలపెంటలో క్వాలిస్ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. 

నాగర్ కర్నూల్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆమ్రాబాద్ మండలం ఈగలపెంటలో క్వాలిస్ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి.

వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. ప్రమాద సమయంలో క్వాలిస్‌లో పది మంది ప్రయాణికులు వున్నారు. ఈ వాహనాన్ని హైదరాబాద్ మంగళ్‌హాట్‌కు చెందినదిగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు.. ఏయే జిల్లాలంటే?
Tallest Building in Hyderabad : హైదరాబాద్ లో అతిపెద్ద హైరైజ్ టవర్ ఏది? అత్యంత ఎత్తైన టాప్ 10 భవనాలివే