పెళ్లి చేసుకుంటానని..వర్థమాన నటిపై అత్యాచారం, గర్భం రావడంతో..

Published : Jul 12, 2021, 07:57 AM IST
పెళ్లి చేసుకుంటానని..వర్థమాన నటిపై అత్యాచారం, గర్భం రావడంతో..

సారాంశం

ప్రేమ పేరిట యువతికి రామకృష్ణ దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో తరచూ తన గదిలోకి తీసుకువెళ్లి.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

వారిద్దరికీ సినీ పరిశ్రమలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకోని.. అతను సదరు యువతిని  ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆ యువతిపై సహ నటుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చగా.. భవిష్యత్తు నాశనం అవుతుందని నమ్మించి అబార్షన్ చేయిచాడు.

పెళ్లి చేసుకోమంటూ యువతి బలవంతం చేయడంతో.. ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. దీంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓ యువతి(25) ఆరు నెలల కిందట నగరానికి వచ్చింది. నల్లకుంట సమీపంలో తన సోదరితో కలిసి నివసిస్తోంది. కాగా... సదరు యువతికి కొద్ది నెలల కిందట సినిమాలో నటించే అవకాశం రావడం, అక్కడ షూటింగ్ సమయంలో సహ నటుడు ప్రకాశం జిల్లా ఉయ్యాలవాడ మండలం సింగంపల్లి ప్రాంతానికి చెందిన రహమత్ నగర్ లో నివిస్తున్న రామకృష్ణ(24) తో పరిచయం ఏర్పడింది.

ప్రేమ పేరిట యువతికి రామకృష్ణ దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో తరచూ తన గదిలోకి తీసుకువెళ్లి.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చగా.. అబార్షన్ కూడా చేయించాడు. ఆ తర్వాత నుంచి యువతిని అనుమానించడం మొదలుపెట్టాడు. తిట్టడం, కొట్టడం లాంటివి చేసేవాడు. పెళ్లి కూడా చేసుకోనంటూ తేల్చి చెప్పాడు. దీంతో.. బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

ఎమ్మెల్యేల ఆటల పోటీలు రెఅవంత్ రెడ్డి అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu
స్టూడెంట్స్ తో పోటీగా ఫుట్‌బాల్‌ ఆడిన సీఎం | CM Revanth Reddy Plays Football | Asianet News Telugu