తెలంగాణలో అదుపులోకి కరోనా : 500లోపే కొత్త కేసులు.. నారాయణ పేట, కామరెడ్డిలలో ‘‘సున్నా’’

Siva Kodati |  
Published : Jul 11, 2021, 08:59 PM IST
తెలంగాణలో అదుపులోకి కరోనా : 500లోపే కొత్త కేసులు.. నారాయణ పేట, కామరెడ్డిలలో ‘‘సున్నా’’

సారాంశం

తెలంగాణలో కొత్తగా 465 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్న 865 మంది కరోనా నుంచి కోలుకోగా.. 10,316 మంది చికిత్స పొందుతున్నారు. 24 గంటల వ్యవధిలో నలుగురు మరణించడంంతో.. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,729కి చేరింది. 

తెలంగాణలో కరోనా వ్యాప్తి నెమ్మదిగా అదుపులోకి వస్తోంది. గడచిన 24 గంటల్లో 65,607 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 465 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 70 కేసులు, కరీంనగర్ జిల్లాలో 42, ఖమ్మం జిల్లాలో 32 కేసులు వెల్లడయ్యాయి. నారాయణపేట, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. అదే సమయంలో 869 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,31,683 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,17,638 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,316 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా మరణాలతో కలిపి తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 3,729కి పెరిగింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 23, జీహెచ్ఎంసీ 70, జగిత్యాల 13, జనగామ 3, జయశంకర్ భూపాలపల్లి 14, గద్వాల 3, కామారెడ్డి 0, కరీంనగర్ 42, ఖమ్మం 32, ఆసిఫాబాద్ 4, మహబూబ్‌నగర్ 7, మహబూబాబాద్ 8, మంచిర్యాల 25, మెదక్ 3, మేడ్చల్ మల్కాజిగిరి 20, ములుగు 9, నాగర్ కర్నూల్ 6, నల్గగొండ 14, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 11, పెద్దపల్లి 14, సిరిసిల్ల 12, రంగారెడ్డి 23, సిద్దిపేట 21, సంగారెడ్డి 7, సూర్యాపేట 33, వికారాబాద్ 2, వనపర్తి 5, వరంగల్ రూరల్ 15, వరంగల్ అర్బన్ 23, యాదాద్రి భువనగిరిలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే