అధిక లాభాలని ఆశచూపించి.. రూ.43లక్షల టోకరా..!

Published : Jun 11, 2021, 07:31 AM IST
అధిక లాభాలని ఆశచూపించి.. రూ.43లక్షల టోకరా..!

సారాంశం

మరుసటి రోజు రూ.7లక్షలు పంపారు. వాటికి లాభం వచ్చిందని రూ.2.75లక్షలు సీఏ ఖాతాలో జమ చేశాడు. లాభాలు వస్తున్నాయని సదరు అకౌంటెంట్ ని నమ్మించాడు. 

మోసపోయేవాడు ఉంటే.. మోసం చేసేవాళ్లు చాలా మందే పుట్టుకొస్తారు. తాజాగా..  ఓ కేటుగాడు.. అధిక లాభాలు ఆశచూపించి.. ఛార్టెర్డ్ అకౌంటెంట్ నుంచి దాదాపు రూ.43లక్షలు కాజేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నగరానికి చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్ కు మే 11న ధీరజ్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తమ దగ్గర పెట్టుబడి పెడితే కేవలం వారం రోజుల్లో 20శాతం లాభాలు ఇస్తామన్నాడు. ఆ లాభాల్లో 20శాతం తమ సంస్థకు ఇవ్వాల్సి ఉంటుందని  ఒప్పందం చేసకున్నాడు. ఇదంతా నమ్మిన బాధితుడు ఆ మోసగాడు చెప్పినట్లు కొంత డబ్బును ఆన్ లైన్ లో పంపించారు.

మరుసటి రోజు రూ.7లక్షలు పంపారు. వాటికి లాభం వచ్చిందని రూ.2.75లక్షలు సీఏ ఖాతాలో జమ చేశాడు. లాభాలు వస్తున్నాయని సదరు అకౌంటెంట్ ని నమ్మించాడు. ఇదేదే బాగుందని భావించిన అతను వెంటనే మరో రూ.7లక్షలు పంపించాడు. ఆ మరుసటి రోజు రూ.16లక్షలు పంపించాడు. ఇలా విడతలుగా రూ.43లక్షలు పంపించాడు.

తర్వాత లాభాలు ఏవీ అంటే.. మాట మార్చడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా.. లాభాలు కాదు కదా.. అసలు కూడా ఇవ్వనంటూ తేల్చి చెప్పాడు. దీంతో మోసపోయానని అర్థం చేసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?