తెలంగాణలో కరోనా తగ్గుముఖం: కేసుల కంటే రికవరీలే అధికం

Siva Kodati |  
Published : Jun 10, 2021, 08:58 PM IST
తెలంగాణలో కరోనా తగ్గుముఖం: కేసుల కంటే రికవరీలే అధికం

సారాంశం

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 1,30,430 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,798 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 1,30,430 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,798 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 5,98,611కి చేరింది. వైరస్ బారినపడి 14 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.  రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 2,524 మంది బాధితులు కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 23,561 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో 95.48 శాతం రికవరీ రేటు నమోదవుతున్నట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 86, జీహెచ్ఎంసీ 174, జగిత్యాల 39, జనగామ 15, జయశంకర్ భూపాలపల్లి 40, గద్వాల 18, కామారెడ్డి 7, కరీంనగర్ 91, ఖమ్మం 165, మహబూబ్‌నగర్ 45, ఆసిఫాబాద్ 7, మహబూబాబాద్ 68, మంచిర్యాల 65, మెదక్ 11, మేడ్చల్ మల్కాజిగిరి 95, ములుగు 37, నాగర్ కర్నూల్ 26, నల్గగొండ 151, నారాయణపేట 10, నిర్మల్ 11, నిజామాబాద్ 20, పెద్దపల్లి 88, సిరిసిల్ల 37, రంగారెడ్డి 107, సిద్దిపేట 51, సంగారెడ్డి 40, సూర్యాపేట 84, వికారాబాద్ 35, వనపర్తి 33, వరంగల్ రూరల్ 29, వరంగల్ అర్బన్ 61, యాదాద్రి భువనగిరిలో 46 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
Holidays : ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్