హైదరాబాద్ లో ఫింగర్ ప్రింట్ సర్జరీ ముఠా గుట్టురట్టు.. వేలిముద్రలు కనిపించకుండా ఉండేలా కొత్తరకం సర్జరీ..

By Bukka SumabalaFirst Published Sep 1, 2022, 1:00 PM IST
Highlights

ఆపరేషన్ చేసి వేలిముద్రలు మారుస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. గల్ఫ్ వెళ్లేందుకు రిజక్టైన వారిని అక్రమమార్గాల్లో పంపించడానికి ఇలా చేస్తున్నట్లు సమాచారం. 

హైదరాబాద్ : హైదరాబాదులో కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. నగరంలో ఫింగర్ప్రింట్ సర్జరీ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు కొత్త తరహాలో ఈ ముఠా ప్రయత్నాలు చేస్తోంది. గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే వేలిముద్రలు తప్పనిసరి. అయితే,  ఒకసారి రిజక్ట్ అయిన యువకులు సర్జరీలతో మళ్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సంవత్సరం పాటు వేలిముద్రలు కనిపించకుండా ఉండేలా కొత్తరకం సర్జరీ చేస్తున్నట్లు సమాచారం. సర్జరీ తర్వాత దొడ్డిదారిన గల్ఫ్ దేశాలకు వెళుతున్నట్లు  తెలుస్తోంది. యువకులకు వేలిముద్రల సర్జరీ చేస్తున్న డాక్టర్ తో పాటు కొంతమంది సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. 

ఇదిలావుండగా, జీహెచ్ఎంసీలో చోటుచేసుకున్న సింథటిక్ ఫింగర్ ప్రింట్  స్కామ్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇది జులైలో జరిగింది. హైదరాబాద్ సిటీ పోలీసుల సహకారంతో జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సింథటిక్ ఫింగర్ప్రింట్ స్కామ్ ను చేధించిన సంగతి తెలిసిందే. గోషామహల్, మలక్పేట సర్కిళ్ల పరిధిలో ఈ స్కామ్ వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించి గోషామహల్ ఎస్ఎఫ్ఏ వెంకట్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 

డ్రగ్స్ కేసులో కీలక నెట్ వర్క్ ను చేధించాం: హైద్రాబాద్‌ సీపీ సీవీ ఆనంద్

ఫెవికాల్, ఎంసిల్ మిక్స్ చేసి  కృత్రిమ వేలిముద్రలు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. యూట్యూబ్ లో చూసి కృత్రిమ వేలిముద్రలు తయారుచేశారని నిర్ధారణకు వచ్చారు, ఫెవికాల్ లో ఎంసిల్ మిక్స్ చేసి వచ్చిన సింథటిక్ లాంటి పదార్థాన్ని తమతోపాటు ఫీల్డ్ లోకి తీసుకు వెళ్ళి పంచ్ చేశారని పోలీసులు గుర్తించారు. మొత్తం ఇరవై ఒక్క కృత్రిమ ఫింగర్ ప్రింట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అసలు సూత్రధారులను త్వరలోనే బయటపెడతామని పోలీసులు చెబుతున్నారు. 

‘శానిటేషన్ విభాగంలోని చాలా మంది కార్మికులు భౌతికంగా విధులకు హాజరు కాలేదు. కానీ, వారి హాజరు క్రమం తప్పకుండా గుర్తించబడుతుంది’ అని ఒక అధికారి తెలిపారు. జిహెచ్ఎంసిలోని ఇతర సర్కిళ్లలో కూడా ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయేమో పరిశీలించాల్సి ఉందని అన్నారు. 

click me!