పాతబస్తీలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు.. మహిళతో సహా ముగ్గురు అరెస్ట్..

Published : Feb 20, 2023, 11:13 AM IST
పాతబస్తీలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు.. మహిళతో సహా ముగ్గురు అరెస్ట్..

సారాంశం

హైదరాబాద్ పాతబస్తీలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పాతబస్తీలో దాడులు నిర్వహించిన సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. భారీగా నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ పాతబస్తీలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పాతబస్తీలో దాడులు నిర్వహించిన సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. భారీగా నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. పాతబస్తీలో నకిలీ నోట్ల దందా జరుగుతున్నట్టుగా పోలీసులకు సమాచారం వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై నిఘా పెట్టిన పోలీసులు.. ఆదివారం రాత్రి నకిలీ  నోట్ల మార్పిడి జరుగుతుందని తెలుసుకుని దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ. 30 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 

అలాగే నకిలీ నోట్ల ముద్రణకు ఉపయోగించే ప్రింటర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. నిందితులు గత కొంతకాలంగా ఈ దందా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. నకిలీ కరెన్సీ ముఠాకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్టుగా  పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?