ఉగ్రవాదులతో లింక్: జగిత్యాల యువకుడిని అదుపులోకి తీసుకొన్న కాశ్మీర్‌ పోలీసులు

Published : Mar 03, 2020, 02:31 PM IST
ఉగ్రవాదులతో లింక్: జగిత్యాల యువకుడిని అదుపులోకి తీసుకొన్న కాశ్మీర్‌ పోలీసులు

సారాంశం

ఉగ్రవాదులకు ఆర్ధిక సహయం చేశారనే అనుమానంతో జగిత్యాల కు చెందిన రాకేష్ అనే యువకుడిని మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. 

జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మల్లాపూర్ మండలం కుస్టాపూర్ గ్రామానికి చెందిన రాకేష్ అనే వ్యక్తిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్‌లో ఉన్న స్నేహితుడి సూచన మేరకు గూగుల్ పే అకౌంట్ ద్వారా రూ. 5వేలను డబ్బులు బదిలీ చేసినట్టుగా కాశ్మీర్ పోలీసులు గుర్తించారు. 

జగిత్యాలకు సమీపంలోని మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో రాజేష్ ను పోలీసులు విచారిస్తున్నారు. మల్లాపూర్ మండలానికి చెందిన రాకేష్  కోసం కాశ్మీర్ పోలీసులు మంగళవారం నాడు  ఇక్కడికి వచ్చారు. టెర్రరిస్టులకు ఆర్ధిక సహాయం అందించినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఈ వ్యక్తికి సంబంధించిన బ్యాంకు ఖాతా వివరాల గురించి కాశ్మీర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో  పోలీసులు రాకేష్ ను విచారిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Railway: జీడిపప్పు వ్యాపారి చేసిన ప‌నికి దిగొచ్చిన ఇండియ‌న్ రైల్వే.. రూ.35,000 నష్టపరిహారం
Mega Kitchen in Madhira: ఒక్క కిచెన్.. 16 మండలాల పిల్లలకు వేడి భోజనం | Bhatti Vikramarka | Asianet