కరోనా వైరస్ సోకిన టెక్కీ ఇల్లు ఇక్కడే: భయం గుప్పిట్లో సికింద్రాబాద్ కాలనీ

By narsimha lodeFirst Published Mar 3, 2020, 12:56 PM IST
Highlights

సికింద్రాబాద్ కు చెందిన టెక్కీకి కరోనా లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించడంతో టెక్కీ నివాసం ఉన్న సికింద్రాబాద్ కు చెందిన మహేంద్ర హిల్స్ వాసులు భయంతో గడుపుతున్నారు.

హైదరాబాద్: సికింద్రాబాద్‌కు చెందిన టెక్కీకి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించడంతో అతను నివాసం ఉన్న ప్రాంత వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంత వాసులు ఇండ్ల నుండి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మాస్కులు లేకుండా జనం బయటకు రావడం లేదు.

Also read:హైద్రాబాద్‌లో కరోనా కేసు: అత్యవసరంగా కేబినెట్ సబ్ కమిటీ భేటీ

సికింద్రాబాద్‌కు చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్  దుబాయ్ వెళ్లి తిరిగి వచ్చాడు అతను. కరోనా వ్యాధి లక్షణాలు ఉండడంతో అతడిని గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స నిర్వహిస్తున్నారు. 

సాప్ట్ వేర్ ఇంజనీర్ సికింద్రాబాద్‌లోని మహేంద్ర హిల్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఈ ప్రాంతంలో  అత్యంత ధనవంతులు నివాసం ఉంటారు. ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు కూడ ఈ ప్రాంతంలో ఎక్కువగా నివాసం ఉంటున్నారు.

కరోనా వ్యాధి లక్షణాలు  ఉన్నట్టుగా గుర్తించిన టెక్కీ కూడ ఇదే ప్రాంతంలో నివాసం ఉన్నాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ కు కరోనా లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించడంతో ఈ ప్రాంతానికి చెందిన వారంతా ఇండ్ల నుండి బయటకు రావాలంటే భయంతో జంకుతున్నారు.  దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

ఈ ప్రాంతంలో చెత్తా చెదారం పోగు కాకుడా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఇదే ప్రాంతంలోని వైజయంతి, త్రిమూర్తి కాలనీ వాసులు తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటకు వస్తున్నారు.  అంతేకాదు మాస్క్‌లు లేకుండా బయటకు రావడం లేదు. ఈ ప్రాంతంలోని ఇండ్లలో పనిచేసేందుకు కూడ పనిమనుషులు కూడ ముందుకు రావడం లేదు. 

 హైద్రాబాద్‌లో ఇప్పటికే 89 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తే 81 మందికి ఈ వ్యాధి లక్షణాలు నిర్ధారణ కాలేదు. దుబాయ్ నుండి వచ్చిన టెక్కీకి వ్యాధి లక్షణాలు ఉన్నట్టుగా తేలింది. ఇక మిగిలినవారి రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని  కేబినెట్ సబ్ కమిటీ  చర్చించింది.
 

click me!