రాజకీయనేతల నుండి డబ్బులు వసూలు: మావోయిస్టు కొరియర్ అరెస్ట్, రూ. లక్ష సీజ్

By narsimha lode  |  First Published Dec 5, 2022, 3:02 PM IST

వాజేడు మండలం జగన్నాథపురంలో  మావోయిస్టు పార్టీ కొరియర్ ను పోలీసులు అరెస్ట్  చేశారు.  రాజకీయ నేతల నుండి డబ్బులను వసూలు చేసుకొని  వెళ్తున్న కొరియర్ ను పోలీసులు అరెస్ట్  చేశారు. 


వాజేడు: ములుగు జిల్లా  వాజేడు మండలం జగన్నాథపురంలో  మావోయిస్టు పార్టీ కొరియర్  సుమన్  ను సోమవారం నాడు పోలీసులు అరెస్ట్  చేశారు. మావోయిస్టుల ఆదేశాలతో  రాజకీయ నేతల వద్ద  లక్ష రూపాయాలు  వసూలు చేశాడు సుమన్.  ఈ డబ్బును తీసుకొని  మావోయిస్టుల వద్దకు  వెళ్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు సుమన్ ను అరెస్ట్  చేశారు.  సుమన్  వద్ద సెల్  ఫోన్, లక్ష నగదు, మావోయిస్టుల లెటర్ హెడ్ ప్యాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

గత  కొన్నేళ్లుగా  రెండు తెలుగు రాష్ట్రాల్లో  మావోయిస్టు పార్టీ  ప్రాబల్యం  తగ్గుతూ వచ్చింది.తెలంగాణ రాష్ట్రంలో  ఇటీవల కాలంలో  కొన్ని ప్రాంతాల్లో  మావోయిస్టులు కదలికలు ఉన్నట్టుగా  పోలీసులు గుర్తించారు. కొన్ని జిల్లాల్లో  మావోయిస్టులు రిక్రూట్ మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నారని కూడా నిఘా వర్గాలు పసిగట్టాయి.  దీంతో  పోలీస్ శాఖ మావోయిస్టు పార్టీ కదలికలు  ఉన్న ప్రాంతంపై కేంద్రీకరించింది.  కొన్ని జిల్లాల్లో  రాజకీయ నేతలకు మావోయిస్టుల పేరుతో  హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. 

Latest Videos

click me!