పిల్లలను పాడుచేసేది తల్లిదండ్రులే.. మెడికల్‌ కాలేజీల్లో డొనేషన్లు లేవు: మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్

By Sumanth KanukulaFirst Published Dec 5, 2022, 1:51 PM IST
Highlights

పిల్లలు అణిముత్యాలు అని.. వాళ్లను పాడు చేసేది తల్లిదండ్రులేనని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. అబ్బయిలు, అమ్మాయిలు.. ప్రేమ, దోమ, ప్రెండ్షిప్ వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. 

పిల్లలు అణిముత్యాలు అని.. వాళ్లను పాడు చేసేది తల్లిదండ్రులేనని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. అబ్బయిలు, అమ్మాయిలు.. ప్రేమ, దోమ, ప్రెండ్షిప్ వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. ఎంబీబీఎస్ అంటేనే చదువు అని.. అది ఉంటేనే లైఫ్‌లో సక్సెస్ అవుతారని చెప్పారు. తన  విద్యాసంస్థల్లో జరిగిన ఓ కార్యక్రమంలో మల్లారెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనదంతా ఓపెన్ హార్ట్ అని.. తాను ఏది దాచుకోనని అన్నారు. భూమి అమ్మి తన కొడుకును ఎంబీబీఎస్ చేయించానని చెప్పారు. తన కొడుకును డాక్టర్ చేస్తే.. తనకు డాక్టర్ కోడలు గిఫ్ట్‌గా వచ్చిందన్నారు. 

మెడికల్‌ కాలేజీల్లో డొనేషన్లు లేవు.. అంతా ఆన్‌లైన్‌ అడ్మిషన్లేనని చెప్పారు. తన కొడుకుకు సీటు కావాలన్నా తాను ఇవ్వలేనని తెలిపారు. తనపై ఐటీ రైడ్స్‌ చేశారని.. తాను భయపడలేదని అన్నారు.  400 మంది వచ్చారని.. వాళ్లపని వాళ్లు చేసుకున్నారని చెప్పారు. తాను క్యాసినో నడిపించడం లేదని.. కాలేజీలు నడిపిస్తున్నానని అన్నారు. తుఫాన్‌లు వచ్చినా తట్టుకునే ధైర్యం వచ్చిందని తెలిపారు. విద్యార్థులు తనను రోల్ మోడల్‌గా తీసుకోవాలని.. కష్టపడితే ఎవరైనా సక్సెస్ అవుతారని అన్నారు. 

click me!