వరంగల్ లో విషాదం.. కొబ్బరిముక్క గొంతులో అడ్డుపడి పదినెలల చిన్నారి మృతి...

By SumaBala BukkaFirst Published Dec 5, 2022, 2:03 PM IST
Highlights

కొబ్బరిముక్క గొంతులో ఇరుక్కుని ఓ పదినెలల బాబు మృత్యువాత పడ్డారు. దీంతో వరంగల్ లో ఈ ఘటన విషాదం నింపింది. 

వరంగల్ : తెలంగాణలోని వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొబ్బరి ముక్క ఓ చిన్నారి ప్రాణం తీసింది. నెక్కొండ మండలం వెంకట్ తండాలో ఓ మణికంఠ పదినెలల చిన్నారి కొబ్బరిముక్క గొంతులో ఇరుక్కుని మృతి చెందాడు. వారం రోజుల్లో ఇలా గొంతులో ఏదో ఒకటి అడ్డుపడి మరణించిన మూడో ఘటన ఇది. చాక్లట్ గొంతులో ఇరుక్కుని ఓ చిన్నారి, మటన్ ముక్క ఇరుక్కుని ఒకరు.. ఇవ్వాళ కొబ్బరి ముక్కతో మరో చిన్నారి ప్రాణాలు పోయాయి. 

మణికంఠ తండ్రి అయ్యప్పమాల వేసుకున్నాడు. దీంతో ఇంట్లో నిత్యం పూజలు, దేవుడికి కొబ్బరికాయలు కొట్టడం చేస్తున్నారు. ఇక మాల వేసుకున్నవారు ఇంట్లో ఉంటే మహిళలకు విపరీతమైన పని ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పదినెలల చిన్నారి ఏడుస్తుంటే ఊరడించడానికి తల్లి.. చిన్నారికి కొబ్బరి ముక్క చేతికి ఇచ్చింది. దీంతో ఆడుకుంటూ బాలుడు నోట్లో పెట్టుకుని కొరుకుతూ ఉండగా.. ఓ ముక్క గొంతులో అడ్డుపడింది. శ్వాస ఆడక మృతి చెందాడు. 

నవంబర్ 27న ఇలాంటి ఘటనే వరంగల్ పిన్నవారి వీధిలో చోటు చేసుకుంది. ఆ ఘటనలో చాక్లెట్ గొంతులో ఇరుక్కోవడంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి సందీప్ తండ్రి ఇటీవలే ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. అక్కడినుంచి పిల్లల కోసం చాక్లెట్లు తెచ్చాడు. ఆ చాక్లెట్ ను స్కూలుకు తీసుకువెళ్లిన చిన్నారి.. తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. 

పిల్లలను పాడుచేసేది తల్లిదండ్రులే.. మెడికల్‌ కాలేజీల్లో డొనేషన్లు లేవు: మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్

మరో ఘటనలో ఓ వ్యక్తి మాంసాహారం భుజిస్తుండగా మటన్ ముక్క గొంతులో ఇరుక్కుంది. ఎంత ప్రయత్నించినా అది వెలికి రాలేదు. దీంతో ఊపిరి ఆడక అతను మరణించాడు. 

ఇదిలా ఉండగా, ఈ యేడాది ఫిబ్రవరిలో అచ్చం ఇలాంటి ఘటనే చెన్నైలో జరిగింది. గొంతులో కొబ్బరిముక్క ఇరుక్కుని మూడున్నరేళ్ల బాలుడు చనిపోయాడు. పొన్నేరి సమీపంలోని పాక్కం గ్రామానికి చెందిన వసంత్ మూడున్నరేళ్ల కొడుకు సంజీశ్వరన్. ఆ చిన్నారి గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుని మరణించాడు. ఇంట్లో వంట చేయడం కోసం కొబ్బరిని ముక్కలు చేసి ఉంచారు. అక్కడే ఆడుకుంటున్న సంజీశ్వరన్ ఆ కొబ్బరి ముక్కలను తీసుకుని తిన్నాడు.

అయితే ఓ పెద్ద ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి ఆడక స్పహ కోల్పోయాడు. తల్లిదండ్రులు వెంటనే చెన్నై స్టాన్లీ ప్రబుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చిననారి మృతి చెందాడు. తిరుపాలైవనం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!