దూలపల్లి పరువు హత్య కేసు .. మృతుడి బావమరిది సహా 11 మంది అరెస్ట్, 5 నెలల క్రితమే రెక్కీ

By Siva Kodati  |  First Published Mar 5, 2023, 6:54 PM IST

హైదరాబాద్ దూలపల్లి పరువు హత్య కేసులో పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. హరీష్‌ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న దీనదయాల్ తన అనుచరులతో కలిసి 5 నెలల క్రితమే రెక్కీ నిర్వహించాడు.


తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హైదరాబాద్ దూలపల్లి పరువు హత్య కేసులో పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. మృతుడు బావమరిది దీనదయాల్‌తో పాటు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. తన చెల్లెల్ని ప్రేమించి పెళ్లాడన్న కోపంతో హరీష్‌ను మూడు రోజుల క్రితం నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా చంపాడు దీనదయాల్. హరీష్‌ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న దీనదయాల్ తన అనుచరులతో కలిసి 5 నెలల క్రితమే రెక్కీ నిర్వహించాడు. అలాగే హత్యకు కావాల్సిన ఆయుధాలను కూడా కొనుగోలు చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది . దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ALso REad: దూలపల్లి పరువు హత్య: హరీష్‌ను చంపిన నిందితులను శిక్షించాలన్న పేరేంట్స్

Latest Videos

కాగా.. మేడ్చల్ జిల్లా దూలపల్లికి చెందిన హరీశ్ మరో కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అయితే అప్పట్లోనే హరీశ్‌ను అమ్మాయి కుటుంబ సభ్యులు హెచ్చిరంచారు. అయినప్పటికీ ఆమెను వదులుకోని హరీశ్ వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే మార్చి 3న రాత్రి 9 గంటల సమయంలో భార్యతో కలిసి బైక్‌పై వెళ్తున్న హరీశ్‌పై దాడి చేసిన దీనదయాల్ గ్యాంగ్.. విచక్షణారహితంగా కత్తులతో పొడిచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో హరీశ్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. 
 

click me!