ఆర్మూరు రైతులపై ఉక్కుపాదం (వీడియో)

First Published Feb 16, 2018, 6:04 PM IST
Highlights
  • వందలాది మంది రైతులను అరెస్టు చేసిన పోలీసులు
  • నిరాహార దీక్ష భగ్నం..
  • సర్కారుు ప్రకటించిన 2300 సరిపోవంటున్న రైతులు

ఆర్మూరులో నిరాహార దీక్ష చేస్తున్న రైతులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలో నింపేశారు. వందల సంఖ్యలో ఆందోళన చేస్తున్న రైతులను అరెస్టు చేశారు.

ఎర్రజొన్న పంట, పసుపు పంటకు మద్దతు ధర కోసం గత రెండు రోజులుగా అన్నదాత రోడ్డెక్కాడు. పెద్ద సంఖ్యలో రైతులు శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. ఆర్మూరులోని అంబేద్కర్ చౌరస్తాలో రైతు సంఘాల నేతలు అన్వేష్ రెడ్డి, మంథని నవీన్ తోపాటు రైతులు నిరహారదీక్షకు దిగారు. పార్టీలకు అతీతంగా రైతులు పెద్ద సంఖ్యలో ఈ దీక్షలో పాల్గొన్నారు. టిఆర్ఎస్ సర్కారు తీపి మాటలతో అన్నదాతను మభ్యపెట్టి మోసం చేస్తోందని రైతు సంఘాల నేతలు మండిపడ్డారు. ఎర్రజొన్న రైతులకు న్యాయం చేస్తామన్న మాటలే తప్ప చేతలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఇస్తామన్న 2300 మద్దతు ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. ఎర్రజొన్నకు 4వేలు, పసుపుకు 10వేలు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రెండోరోజు ఆర్మూరులో ఆందోళనకు దిగిన రైతులందరినీ పోలీసులు అరెస్టు చేశారు. అయతే ఆందోళనను కొత్త పుంతలు తొక్కించేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. రైతుల అరెస్టు వీడియోల కింద చూడొచ్చు.

click me!