వ్యాపారి ఇంట్లో రూ.10లక్షల సొత్తు చోరీ.. అన్నీ తెలిసిన మాజీ డ్రైవరే ప్లాన్ వేసి..

By telugu news teamFirst Published Feb 26, 2020, 12:56 PM IST
Highlights

ఆ తర్వాత ఉద్యోగం కోసం సౌదీ వెళ్లి తిరిగి భారత్ కి వచ్చాడు. అయితే... ఈ మధ్య అతనికి ఆర్థిక సమస్యలు  ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఆ ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు పాత యజమాని ఇంట్లో దొంగతనం చేయాలని భావించాడు. ఈ విషయంలో తన స్నేహితుల సహాయం తీసుకున్నాడు.

ఇటీవల హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో  ప్రముఖ వ్యాపారి నసీర్ అలీఖాన్ ఇంట్లో చోరీ జరిగింది. కాగా.. చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఎంతో తెలివిగా సీసీ కెమేరాల్లో కూడా కనిపించకుండా  చోరీ చేసినప్పటికీ... నిందితులను పోలీసులు పట్టుకోగలిగారు. కాగా... ప్రధాన నిందితుడు ఆ ఇంటి మాజీ డ్రైవర్ కావడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... బోరబండ ప్రాంతానికి చెందిన సయ్యద్ యూసుఫ్ మూడో తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత స్కూల్ కి స్వస్తి చెప్పాడు. కొన్నాళ్లు ఎస్ఆర్ నగర్ లో టైలరింగ్ పనిచేశాడు. అనంతరం 2007లొ డ్రైవర్ గా పనిలో కుదిరాడు. కొంతకాలంగా ఓ ట్రావెల్స్ కంపెనీలో పనిచేశాడు. అనంతరం జూబ్లీహిల్స్ కు చెందిన వ్యాపారి నసీర్ అలీఖాన్ ఇంట్లో డ్రైవర్ గా చేశాడు. దాదాపు 8 సంవత్సరాలపాటు వారి ఇంట్లో డ్రైవర్ గా పనిచేశాడు.

Also Read 15 రోజుల క్రితం అదృశ్యమైన బిటెక్ విద్యార్థి: గోవాలో జల్సాలు చేస్తూ....

ఆ తర్వాత ఉద్యోగం కోసం సౌదీ వెళ్లి తిరిగి భారత్ కి వచ్చాడు. అయితే... ఈ మధ్య అతనికి ఆర్థిక సమస్యలు  ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఆ ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు పాత యజమాని ఇంట్లో దొంగతనం చేయాలని భావించాడు. ఈ విషయంలో తన స్నేహితుల సహాయం తీసుకున్నాడు.

ముందుగా.. ప్రస్తుతం పాత యజమాని ఇంట్లో పనిచేసేవారి సహాయంతో ఆ ఇంట్లో విషయాలు తెలుసుకున్నాడు. ఓ రోజు యజమాని కుటుంబం ఏదో శుభకార్యానికి వెళ్లారనే విషయం తెలుసుకున్నాడు. తమ యజమాని భార్య శుభకార్యం తర్వాత బంగారు నగలను హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి టేబుల్ మీద పెడుతుందన్న్ విషయం సయ్యద్ కి తెలుసు.

అందుకే వాళ్లు ఫంక్షన్ కి వెళ్లి వచ్చిన రోజు రాత్రే దొంగతనానికి ముహుర్తం ఖరారు చేసుకున్నాడు. సీసీ కెమేరాల్లో  కనపడకుండా జాగ్రత్తలు పడ్డాడు. నేరుగా రెండో అంతస్తులోకి ప్రవేశించి బంగారం ఉన్న హ్యాండ్ బ్యాగ్ ని దొంగలించాడు.తర్వాతి రోజు చోరీ జరిగిందని గమనించిన యజమాని పోలీసులకు సమాచారం అందించారు.

దొంగతనం జరిగిన సమయంలో ఇంట్లో చాలా మంది పనివారు ఉన్నప్పటికీ... చోరీ జరుగుతుండటాన్ని కనీసం గమనించలేకపోవడం గమనార్హం. నేరగాళ్ల కోసం రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు ఎన్‌.రంజిత్‌కుమార్, పి.మల్లికార్జున్, మహ్మద్‌ ముజఫర్‌ అలీ ముమ్మరంగా గాలించారు. ఎట్టకేలకు మంగళవారం ముగ్గురినీ పట్టుకుని రూ.10.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. 

click me!