పరిష్కరించుకుందాం, ప్రపంచం చూస్తోంది: ఢిల్లీ అల్లర్లపై కేటీఆర్ ట్వీట్

Published : Feb 26, 2020, 11:12 AM ISTUpdated : Feb 26, 2020, 04:06 PM IST
పరిష్కరించుకుందాం, ప్రపంచం చూస్తోంది: ఢిల్లీ అల్లర్లపై కేటీఆర్ ట్వీట్

సారాంశం

ఢిల్లీ అల్లర్లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. భిన్నాభిప్రాయాలను అతి పెద్ద ప్రజాస్యామ్యానికి అనుగుణంగా గౌరపప్రదమైన రీతిలో పరిష్కరించుకుందామని కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్: ఢిల్లీ అల్లర్లపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీ రామారావు స్పందించారు. ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలతో ఢిల్లీ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 20 మంది మరణించారు. 

అత్యంత సున్నితమైన, హానికరమైన పరిస్థితుల్లో ఉన్నామో దేశ రాజధానిలో చెలరేగిన హింస భారతీయులుగా మనందరికీ గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. 

భారత ప్రతిష్టకు, ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని, ప్రపంచం మనల్నిగమనిస్తోందని ఆయన అన్నారు ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యాం గౌరవప్రదంగా భిన్నాభిప్రాయాలను పరిష్కరించుకుందామని కేటీఆర్ అన్నారు. 

గత మూడు రోజులుగా ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. పరిస్థితులను చక్కదిద్దడానికి అజిత్ దోవల్ కూడా రంగంలోకి దిగారు. 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!