15 రోజుల క్రితం అదృశ్యమైన బిటెక్ విద్యార్థి: గోవాలో జల్సాలు చేస్తూ...

By telugu teamFirst Published Feb 26, 2020, 12:02 PM IST
Highlights

పదిహేను రోజుల క్రితం అదృశ్యమైన బీటెక్ విద్యార్థి జీవన్ రెడ్డి ఎట్టకేలకు గోవాలో తేలాడు. జల్సాలు చేస్తూ అతను గోవాలో ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు. జీవన్ రెడ్డికి క్రికెట్ బెట్టింగ్ లు కట్టే చరిత్ర కూడా ఉంది.

హైదరాబాద్: బిటెక్ విద్యార్థి జీవన్ రెడ్డి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. జీవన్ రెడ్డి 15 రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. అతను గోవాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నల్లగొండ జిల్ాల సిద్ధార్థ కాలనీకి చెందిన జీవన్ ెడ్డి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 

అతను కళాశాలకు సమీపంలో ఉన్న హరిహర హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 11వ తేదీన కాలేజీకి వెళ్లిన జీవన్ రెడ్డి హాస్టల్ కు తిరిగి రాలేదు. హాస్టల్ గదిలోని బాత్రూంలో రక్తం మరకలు కనిపించడంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. 

విద్యార్థి తండ్రి ప్రభాకర్ రెడ్డి తన కుమారుడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 15 రోజులుగా అతని కోసం గాలిస్తూ వచ్చారు. 

ఎట్టకేలకు అతను గోవాలో ఉన్నట్లు గుర్తించారు. జల్సాల కోసమే జీవన్ రెడ్డి గోవా వెళ్లినట్లు చెబుతున్నారు. గతంలో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడిన చరిత్ర జీవన్ రెడ్డికి ఉంది.

click me!