లాక్ డౌన్ లో మద్యంతో వెకిలి చేష్టలు.. యువకులు అరెస్ట్

By telugu news team  |  First Published Apr 14, 2020, 8:26 AM IST
అలాంటి మద్యం దొరకకని మందుబాబులకు ఇద్దరు యువకులు మద్యం పోశారు. దానిని టిక్ టాక్ వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేసి అడ్డంగా పోలీసులకు బుక్కయ్యారు. ఈ సంఘటన నగరంలోనే చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దానిని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించారు. అయితే.. ఈ లాక్ డౌన్ లో మద్యం దొరకక చాలా మంది అవస్థలు పడుతున్నారు. కొందరు పిచ్చి పట్టినట్లు కూడా వ్యవహరిస్తుండటం గమనార్హం.

ఇప్పటికే ఎర్రగడ్డ పిచ్చి ఆస్పత్రిలో చాలా మంది చికిత్స కోసం చేరడం కూడా గమనార్హం. మరికొందరైతే ఏకంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే.. అలాంటి మద్యం దొరకకని మందుబాబులకు ఇద్దరు యువకులు మద్యం పోశారు. దానిని టిక్ టాక్ వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేసి అడ్డంగా పోలీసులకు బుక్కయ్యారు. ఈ సంఘటన నగరంలోనే చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 టిక్‌ టాక్‌ మోజులో పడిన ఇద్దరు యువకులు ఏదైనా భిన్నంగా చేయాలని ఆలోచించారు. మందులేక అల్లాడుతున్న మందుబాబులకు మద్యం  పోస్తూ టిక్‌టాక్‌ చేశారు. అనంతరం ఆ వీడియోలను సోషల్‌మీడియాలో పెట్టారు. కొన్ని గంటల్లోనే ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దృష్టికి వచ్చాయి. 

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు.. అక్రమంగా మద్యం సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు. రంగంలోకి దిగిన సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ అధికారులు ఈది బజార్‌కు చెందిన యువకులు కుమార్‌ సంజూ, నితిన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎక్సైజ్‌ యాక్ట్‌ సెక్షన్‌ 34ఏ ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
click me!