వాట్సాప్ లో యువతి అసభ్య చిత్రాలు.. యువకుడు అరెస్ట్

Published : Feb 26, 2020, 08:25 AM IST
వాట్సాప్ లో యువతి అసభ్య చిత్రాలు.. యువకుడు అరెస్ట్

సారాంశం

ఇందులో భాగంగా మల్కాజిగిరి కి చెందిన ఓ యువతి నెంబర్ ను సంపాదించి ఆమెతో అసభ్యంగా చాట్ చేయడం ప్రారంభించాడు. వాట్సాప్ లో పెట్టిన ఆమె చిత్రాన్ని అభ్యంతరకరంగా ప్రదర్శించాడు. లైంగికంగా ఆమెను వేధించాడు.

వాట్సాప్ లో అసభ్య చిత్రాలు పంపుతూ యువతిని వేధించిన ఓ యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడు తిరువన్నమలైలో ఇంజినీరింగ్ చదువుతున్న మాణిక్యం అరుణ్ ప్రసాద్(25) స్థానికంగా నకిలీ ధ్రువపత్రాలతో పలు ప్రీ ఆక్టివేటెడ్ సిమ్ లను సంపాధించాడు. వాటని ఉపయోగించి నగలు, చీరలు అమ్మే వ్యక్తిని అని చెప్పి ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు.  ఆ గ్రూప్ సహాయంతో పలువురి యువతుల ఫోన్ నెంబర్లు సేకరించాడు.

Also Read ఉరివేసుకొని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య...

ఇందులో భాగంగా మల్కాజిగిరి కి చెందిన ఓ యువతి నెంబర్ ను సంపాదించి ఆమెతో అసభ్యంగా చాట్ చేయడం ప్రారంభించాడు. వాట్సాప్ లో పెట్టిన ఆమె చిత్రాన్ని అభ్యంతరకరంగా ప్రదర్శించాడు. లైంగికంగా ఆమెను వేధించాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసుకున్న పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి నిందితుడిని పట్టుకున్నారు.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. 
 
PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్