విడాకులు ఇచ్చిన భార్యను కిడ్నాప్ చేసి..

Published : Apr 20, 2021, 09:32 AM IST
విడాకులు ఇచ్చిన భార్యను కిడ్నాప్ చేసి..

సారాంశం

విడాకులు తీసుకున్నా కూడా.. భార్యపై అతనికి కోపం చల్లారలేదు. అందుకే.. భార్యను కిడ్నాప్ చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆమెపై దాడి కూడా చేశాడు

వారిద్దరికీ పెళ్లయ్యింది. ఇద్దరికీ కుదరలేదు. మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నా కూడా.. భార్యపై అతనికి కోపం చల్లారలేదు. అందుకే.. భార్యను కిడ్నాప్ చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆమెపై దాడి కూడా చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన బంజారాహిల్స్ లో  చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జూబ్లీహిల్స్‌లో నివాసముండే మహిళ కొద్ది కాలం క్రితం చావ వినయ్‌ చౌదరిని వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్య మనస్పర్ధాలు ఏర్పడ్డాయి. భర్త గృహహింస పెడుతుండడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. విడాకులు కూడా తీసుకున్నారు. 

అయితే ఈ నెల 18న వినయ్‌ ఆమె ఇంట్లోకి ప్రవేశించి కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. స్థానికులు వినయ్‌ను అడ్డుకొని జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడిపై ఐపీసీ 448,354,427,506 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu