అక్రమ సంబంధం.. మహిళ దూరం పెట్టిందని..

Published : Jun 17, 2021, 08:39 AM IST
అక్రమ సంబంధం.. మహిళ దూరం పెట్టిందని..

సారాంశం

అతని ప్రవర్తనలో మార్పు రావడంతో.. సదరు మహిళ దూరం పెట్టడం మొదలుపెట్టింది. దీంతో..  ఆమెను సోషల్ మీడియాలో వేధించడం మొదలుపెట్టాడు. 

ఓ వ్యక్తి స్నేహితుడి ద్వారా మహిళ పరిచయం అయ్యింది. ఆ పరిచయం తొలుత స్నేహంగా మారి.. ఆ తర్వాత  అక్రమ సంబంధానికి దారి తీసింది.  కొంతకాలం వీరి వ్యవహారం బాగానే సాగింది. ఆ తర్వాత.. అతని ప్రవర్తనలో మార్పు రావడంతో.. సదరు మహిళ దూరం పెట్టడం మొదలుపెట్టింది. దీంతో..  ఆమెను సోషల్ మీడియాలో వేధించడం మొదలుపెట్టాడు. ఈ సంఘటన సైదాబాద్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సైదాబాద్‌కు చెందిన చిన్న వెంకన్న రాజశేఖర్‌రెడ్డికి స్నేహితుడి ద్వారా ఓ మహిళ పరిచయం అయింది. వారి స్నేహం వివాహేతర సంబంధానికి దారితీసింది. రాజశేఖర్‌రెడ్డి దురుసు ప్రవర్తన, పద్ధతి నచ్చకపోవడంతో ఆమె అతడిని కొంతకాలంగా దూరం పెడుతోంది. దీంతో మహిళపై కక్ష పెంచుకున్నాడు. 

ఆమె పరువు తీయాలని నిర్ణయించుకున్నాడు. నకిలీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు క్రియేట్‌ చేశాడు. గతంలో ఆమెతో సన్నిహితంగా దిగిన ఫొటోలను అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్‌ చేశాడు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో అందరికీ ఫోస్టు చేస్తున్నాడు. మహిళ స్నేహితులు, కుటుంబ సభ్యులకు పోస్ట్‌లు పెట్టేవాడు. అతడి వేధింపులు భరించలేక ఆమె రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం