నా కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దు.. హైదరాబాద్ పోలీసులకు సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ విజ్ఞప్తి

Siva Kodati |  
Published : Jun 16, 2021, 10:04 PM IST
నా కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దు.. హైదరాబాద్ పోలీసులకు సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ విజ్ఞప్తి

సారాంశం

హైదరాబాద్ నగర పోలీసులకు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక సూచన చేశారు. తన పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌ను నిలిపివేయొద్దని ఆయన నగర పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తన కోసం ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దని జస్టిస్ రమణ పోలీసులను కోరారు.

హైదరాబాద్ నగర పోలీసులకు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక సూచన చేశారు. తన పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌ను నిలిపివేయొద్దని ఆయన నగర పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తన కోసం ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దని జస్టిస్ రమణ పోలీసులను కోరారు. ఈ నెల 19 వరకు రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు జస్టిస్ ఎన్వీ రమణ. 

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. సీజేఐ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత వారంలో ఆయన తొలిసారిగా తిరుమలకు వచ్చారు. తిరమలేశుడిని దర్శించుకొన్న తర్వాత తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చారు రమణ. ఈ సందర్భంగా నిన్న యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామిని సీజేఐ దంపతులు దర్శనం చేసుకొన్నారు. 

Also Read:హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం : జస్టిస్‌ ఎన్‌వీ రమణ

కుటుంబసభ్యులతో కలిసి యాదాద్రి ఆలయానికి వచ్చిన సీజేఐ దంపతులకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. యాదాద్రి లక్ష్మినర్సింహ్మాస్వావి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం  ఆలయా నిర్మాణ పనులను సీజేఐ పరిశీలించారు. సుమారు మూడు గంటలపాటు ఎన్వీరమణ ఆలయంలో గడిపారు.  
 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం