భార్య చెల్లెలితో అక్రమ సంబంధం.. అనుమానంతో...

Published : Jan 26, 2021, 09:20 AM IST
భార్య చెల్లెలితో అక్రమ సంబంధం.. అనుమానంతో...

సారాంశం

. తాను మోజు పడిన మరదలు మరో వ్యక్తి బైక్ పై వెళ్లడం చూసి అనుమానం పెంచుకున్నాడు. తనతో మాత్రమే కాకుండా మరో వ్యక్తితో కూడా సంబంధం పెట్టుకుందని అనుమానపడ్డాడు.

రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన భార్య చెల్లెలితో అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తాను కట్టుకున్న భార్యకు తెలీకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే.. తాను మోజు పడిన మరదలు మరో వ్యక్తి బైక్ పై వెళ్లడం చూసి అనుమానం పెంచుకున్నాడు. తనతో మాత్రమే కాకుండా మరో వ్యక్తితో కూడా సంబంధం పెట్టుకుందని అనుమానపడ్డాడు. ఈ క్రమంలో మరదలిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పన్యానాయక్‌ తండాకు చెందిన సునీత, వనిత(30) అక్కాచెల్లెళ్లు. వనిత భర్త శంకర్‌ 2015లో జరిగిన ప్రమాదంలో మృతి చెందగా, ఆమె పిల్లలతో కలిసి జీవిస్తోంది. దీన్ని ఆసరాగా తీసుకున్న సునీత భర్త యాకూబ్‌ మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈనెల 22న వనిత వేరే వ్యక్తి  బైక్‌పై వెళ్లడాన్ని గమనించిన యాకూబ్‌లో అనుమానం తలెత్తింది. వెంటనే ఆమెకు ఫోన్‌ చేసిన యాకూబ్‌ ఆమెను రాయపర్తిలో ఆగమని చెప్పాడు. అక్కడికి చేరుకుని ఆమెను తన ఇంటికి వెళ్దామని చెప్పి టేకులతండా శివారులో ఉన్న తన పొలంలోకి తీసుకెళ్లాడు.

అక్కడ వనితను పిడిగుద్దులు గుద్ది, తన బైక్‌లో ఉన్న స్ర్కూ డ్రైవర్‌తో గొంతులో పొడిచి హతమార్చాడు. అనంతరం ఇంటికి వెళ్లి భార్యకు విషయాన్ని చెప్పారు. రాత్రి 8గంటల సమయంలో ఇద్దరూ కలిసి వనతి మృతదేహన్ని ట్రాక్టర్‌లో వేసుకుని డీసీతండా శివారులోని ఎస్సారెస్పీ కాల్వలో పడేశాడు. కాగా, సోమవారం మైలారం రిజర్వాయర్‌లో మహిళ మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు వనితగా గుర్తించారు. ఆపై యాకూబ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు.

యాకూబ్ ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా నేరంలో భర్తకు సహకరించిన సునీత కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Today Gold Rate:పసిడి ప్రియులకు Good News.. తగ్గిన బంగారం ధరలు! | 13April2026 | Asianet News Telugu
Summer Heat : ఏంటిది సూరీడూ.. తెలుగు నేలపై 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలా..! ఆలిండియా రికార్డులు బద్దలవుతాయా..?