ఓ యువతితో సహజీవనం.. మరో అమ్మాయితో వివాహం

Published : Sep 12, 2020, 11:04 AM ISTUpdated : Sep 12, 2020, 11:17 AM IST
ఓ యువతితో సహజీవనం.. మరో అమ్మాయితో వివాహం

సారాంశం

యువతి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో వివాహాన్ని ఈ ఏడాది మార్చికి వాయిదా వేసుకున్నారు. దీనికి శివశంకర్‌ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. 

ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. పెద్దలతో పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. ఆతర్వాత ఆ యువతితో సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. అయితే.. అనూహ్యంగా ఈ యువతికి తెలీకుండా.. మరో అమ్మాయి ని పెళ్లి చేసుకున్నాడు. దీంతో మోసపోయిన యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన బంజారాహిల్స్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉదయ్‌నగర్‌కు చెందిన ఓ యువతి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తోంది.. రెండ్లే క్రితం దుబాయ్‌లో ఉద్యోగం చేసే శివశంకర్‌తో పరిచయం కాగా ప్రేమకు దారితీసింది. ఇరు కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించారు. 2019 మేలో పెళ్లి చేయాలని భావించారు.

యువతి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో వివాహాన్ని ఈ ఏడాది మార్చికి వాయిదా వేసుకున్నారు. దీనికి శివశంకర్‌ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. ఈ ఏడాది జనవరిలో శివశంకర్‌ దుబాయ్‌ రావాలని యువతిని కోరాడు. కొద్ది రోజులకు యువతి దుబాయ్‌ వెళ్లింది. అతడు పనిచేసే కార్యాలయానికి వెళ్లగా భారత్‌ వెళ్లినట్లు తోటి ఉద్యోగులు చెప్పారు. వాకబు చేయగా.. శివశంకర్‌ మరో యువతిని వివాహం చేసుకున్నట్టు తెలిసింది. తనతో సహజీవనం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా శివశంకర్‌ మోసం చేశాడని బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

PREV
click me!

Recommended Stories

RTC: ద‌స‌రా పండ‌గ‌కి ఊరుకెళ్తున్నారా.? భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ
Most Expensive Apartment: ఇండియాలో రిచెస్ట్ అపార్ట్‌మెంట్.. ఒక్కోప్లాట్ ఎన్ని కోట్లో తెలుసా?