అదనపు కలెక్టర్ నగేష్ కేసు: పత్తా లేని ముగ్గురు కీలక వ్యక్తులు

By telugu teamFirst Published Sep 12, 2020, 10:06 AM IST
Highlights

తెలంగాణలోని మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ లంచం కేసులో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నగేష్ బండారం బయటపడినప్పటి నుంచి ముగ్గురు ఉద్యోగాలు పత్తా లేకుండా పోయారు.

మెదక్: మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ కు అత్యంత సన్నిహితులుగా మెలుగుకూ వచ్చిన ముగ్గురు ఉద్యోగులు ఎక్కుడున్నారనే విషయం తెలియడం లేదు. నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తిలో 112 ఎకరాల నిషేధిత భూమికి ఎన్వోసీ ఇవ్వడానికి రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేసిన కేసులో అదనపు కలెక్టర్ నగేష్ సహా ఐదుగురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

వారిని అరెస్టు చేసి, నగేష్ నివాసాల్లో సోదాలు ప్రారంభించగానే ఆ ముగ్గురు ఉద్యోగులు కనిపించకుండా పోయారు. ఎన్వోసీ జారీ చేయాలని మెదక్ మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి సంతకం చేసి రిజిస్ట్రేషన్ శాఖఖు పంపిన లేఖ వెలుగులోకి రావడంతో కేసు కొత్త మలుపు తీసుకుంది.

Also Read: రూ. 40 లక్షల లంచం కేసు: తెరపైకి మాజీ కలెక్టర్ పాత్ర, ఏసీబీ విచారణ

అదనపు కలెక్టర్ నగేష్ కు కలెక్టర్ కార్యాలయంలో ముగ్గురు ఉద్యోగులు అత్యంత సన్నిహితంగా ఉండేవారని ప్రచారం జరుగుతోంది. ఆ ముగ్గురిలో ఒకరు కలెక్టర్ పరిపాలనా విభాగంలో పనిచేస్తారు. మరొకరు అదనపు కలెక్టర్ కార్యాలయంలో అన్నీ తానై వ్యవహరిస్తారు. మరొకరు అన్నింట్లోనూ సహకరించే వ్యక్తి.. వీరు అకస్మాత్తుగా మాయం కావడంతో ఏసీబీ అధికారులు వారిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 

ఎన్వోసీ ఇచ్చే విషయంలో మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి రాసిన లేఖపై పదవీ విరమణ రోజు సంతకం చేశారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత ధర్మా రెడ్డి హైదరాబాదులో ఉంటున్నాడు. మెదక్ లోని ప్రభుత్వ భవనాన్ని కూడా ఆయన ఖాళీ చేయలేదు. 

Also Read: రూ. 40 లక్షల లంచం: మెదక్ అడిషనల్ కలెక్టర్ సహా ఐదుగురి అరెస్ట్

ఆ భవనంలో పనిచేసే ఉద్యోగులకు ధర్మారెడ్డి ఇంతకు ముందు ప్రతి రోజూ ఫోన్ చేసేవారని, నగేష్ లంచం తీసుకుంటూ పట్టుబడిన తర్వాత ఫోన్లు చేయడం మానేశాడని అంటున్నారు. ధర్మారెడ్డిని ఏసీబీ అదికారులు విచారించే అవకాశం ఉంది.

చిప్పల్ తుర్తి గ్రామంలోని 58, 59 సర్వే నెంబర్లలోని భూమి ఎన్వోసీ దరఖాస్తు విషయంలో నర్సాపూర్ తహసీల్దార్ మాలతి సెలవులో ఉన్నారు. అప్పుడు ఆర్డీవో అరుణా రెడ్డి, ఇంచార్జీ తాహిసిల్దార్ గా ఉన్న సత్తార్ కు ఈ వ్యవహారంలో లక్ష రూపాయల చొప్పున ముట్టినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

click me!