సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు అరెస్ట్.. 14 రోజుల రిమాండ్ విధించిన జడ్జ్..

By team teluguFirst Published Nov 18, 2021, 10:31 AM IST
Highlights

సంధ్య కన్వెన్షన్ (sandhya convention) ఎండీ శ్రీధర్ రావును (sridhar rao) పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం బెంగళూరులో శ్రీధర్‌ రావును అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. 

సంధ్య కన్వెన్షన్ (sandhya convention) ఎండీ శ్రీధర్ రావును (sridhar rao) పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గంలో కమర్షియల్ కాంప్లెక్స్‌ వ్యవహారంలో శ్రీధర్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన శ్రీధర్‌ రావు కోట్ల రూపాయాలు కొట్టేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై పులవురు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే నిన్న బెంగళూరులో శ్రీధర్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. గురువారం తెల్లవారుజామున న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. దీంతో జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు శ్రీదర్‌రావును చర్లపల్లి జైలుకు తరలించారు. 

ఇక, హైదరాబాద్‌తో (hyderabad) పాటు ముంబైకి (mumbai) చెందిన ప్రముఖ బిల్డర్స్‌ని కూడా శ్రీధర్ రావు మోసం చేసినట్లు సమాచారం. దీంతో వారు డబ్బుల కోసం శ్రీధర్ రావు చుట్టూ తిరిగినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని (jubilee hills) ప్రముఖ శారీసెంటర్ యజమానురాలిని కూడా శ్రీధర్ రావు మోసం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీధర్‌రావు రూ. 11 కోట్లు తీసుకుని శ్రీధర్ రావు ప్లాట్ అప్పగించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసులు ఫిర్యాదు చేశాడు. 

Also read: శ్రీధర్‌ రావు మోసాల విలువ రూ.300 కోట్ల పైనే.. ముంబైలోనూ చీటింగ్, తప్పించేందుకు ఓ ఎస్పీ యత్నం

దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 10వ తేదీన శ్రీధర్ రావును అరెస్ట్ చేసిన రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది. అయితే తాజాగా చైతన్య కృష్ణమూర్తి తనకు సంబంధించిన ప్లాట్‌ను మరోకరి పేరిట రిజిస్ట్రేషన్ చేసి కోట్ల రూపాయలు మోసం చేశాడని పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా మరికొందరు కూడా వివిధ పోలీస్ స్టేషన్‌లో శ్రీధర్‌రావుపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు బుధవారం సాయంత్రం బెంగళూరులో శ్రీధర్‌రావును అరెస్ట్ చేశారు. 

సంధ్య కన్వెన్షన్‌ ఎండీ శ్రీధర్‌రావు మోసాలపై బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర చెప్పారు. ఇప్పటి వరకు ఆయనపై వివిధ పోలీస్‌స్టేషన్‌లలో వచ్చిన ఆరు ఫిర్యాదులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.

click me!