లాక్డౌన్ నేపథ్యంలో నిబంధనలకు విరుద్దంగా రోడ్లపైకి వచ్చారని పదేళ్ల కొడుకు ముందే తండ్రిని కొట్టిన ఘటనలో ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనకు పాల్పడిన కానిస్టేబుల్ ఆశోక్ ను జిల్లా ఎస్పీ అపూర్వరావు సస్పెండ్ చేశారు.
వనపర్తి:లాక్డౌన్ నేపథ్యంలో నిబంధనలకు విరుద్దంగా రోడ్లపైకి వచ్చారని పదేళ్ల కొడుకు ముందే తండ్రిని కొట్టిన ఘటనలో ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనకు పాల్పడిన కానిస్టేబుల్ ఆశోక్ ను జిల్లా ఎస్పీ అపూర్వరావు సస్పెండ్ చేశారు.
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వనపర్తి పట్టణంలో పదేళ్ల కొడుకుతో ఓ వ్యక్తి రోడ్డుపైకి వచ్చాడు. నిబంధనలకు విరుద్దంగా రోడ్డుపైకి వచ్చావంటూ కొడుకు ముందే కానిస్టేబుల్ ఆ వ్యక్తిని చితకబాదాడు. ఈ సమయంలో తన తండ్రిని కొట్టొద్దంటూ ఆ బాలుడు పోలీసులను వేడుకొన్నాడు.
undefined
Also read:కొడుకు ముందే తండ్రిని కొట్టిన వనపర్తి పోలీసులు:రంగంలోకి కేటీఆర్
అంకుల్ వదిలిపెట్టండి అంటూ ప్రాధేయపడ్డాడు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. తండ్రిని విచక్షణరహితంగా కొట్టారు. తండ్రి కొడుకులను పోలీస్ వ్యాన్ ఎక్కించి తీసుకెళ్లారు.
ఈ దాడి దృశ్యాలను లక్ష్మణ్ అనే వ్యక్తి రికార్డు చేసి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డిజీపీ మహేందర్ రెడ్డిని కోరారు.
ఈ ఘటనపై డీజీపీ విచారణ చేయాలని వనపర్తి ఎస్పీ అపూర్వరావును ఆదేశించారు డీజీపీ మహేందర్ రెడ్డి. దీంతో ఎస్పీ విచారణ జరిపారు. ఈ ఘటనకు కారణమైన ఆశోక్ ను సస్పెండ్ చేస్తున్నట్టుగా గురువారం నాడు మధ్యాహ్నం ప్రకటించారు.