భర్త దొంగని.. మరో వ్యక్తితో భార్య అక్రమ సంబంధం..చివరకు..

Published : Apr 02, 2020, 09:21 AM IST
భర్త దొంగని.. మరో వ్యక్తితో భార్య అక్రమ సంబంధం..చివరకు..

సారాంశం

వివాహ అనంతరం కూడా అదేవృత్తిని కొనసాగిచడంతో, వివిధ ప్రాంతాల్లో సుమా రుగా 40పైగా కేసులు నమోదయ్యాయి. స్రవంతి పానగల్‌కు చెందిన మున్నా శేఖర్‌ అనే వ్యక్తితో పాఠశాలలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ విషయం వెంకట్‌రెడ్డికి తెలియడం తో గొడవలు జరిగాయి.   

ఆమెకు పెళ్లై దాదాపు 13 సంవత్సరాలు అవుతోంది. ఆమె భర్త ఓ దొంగ. చైన్ స్నాచింగ్ లు చేస్తూ జీవనం సాగించేవాడు. భర్త చేస్తే వృత్తి నచ్చని భార్య.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనిలో భాగంగానే అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసింది. ఈ సంఘటన నల్గొండలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన మారం వెంకట్‌రెడ్డి 13ఏళ్ల క్రితం పానగల్‌కు చెందిన చాపల స్రవంతిని వివాహం చేసుకున్నాడు.వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకట్‌రెడ్డి వివాహానికి ముందునుంచే జల్సాలకు అలవాటుపడి చోరీలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. 

Also readకరోనా ఎఫెక్ట్: గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌ను మూసివేయాలని మంత్రికి వినతి...

వివాహ అనంతరం కూడా అదేవృత్తిని కొనసాగిచడంతో, వివిధ ప్రాంతాల్లో సుమా రుగా 40పైగా కేసులు నమోదయ్యాయి. స్రవంతి పానగల్‌కు చెందిన మున్నా శేఖర్‌ అనే వ్యక్తితో పాఠశాలలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ విషయం వెంకట్‌రెడ్డికి తెలియడం తో గొడవలు జరిగాయి. 

ఈ క్రమంలో టూటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో వెంకట్‌రెడ్డిపై స్రవంతి ఫిర్యా దు చేసి పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు. అదే సమయంలో సాగర్‌రోడ్డులో ఎస్‌ఎల్‌బీసీలో ఉన్న ఓమద్యంషాపులో మద్యంచోరీ ఘటనలో వెంకట్‌రెడ్డి జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చాడు. వెంకట్‌రెడ్డిని ఎలాగైనా అడ్డుతొలగించి స్రవంతిని పెళ్లి చేసుకోవాలని శేఖర్‌ పథకం వేశాడు. ఈ నెల 26న వెంకట్‌రెడ్డి ఓ డీసీఎంలో హైదరాబాద్‌ బయల్దేరాడు.

మర్రిగూడ స్టేజీ వద్ద శేఖర్‌తో పాటు అతడి స్నేహితులతో కలిసి కారులో డీసీఎంకు అడ్డుపెట్టి, వెంకట్‌రెడ్డిని కారులో ఎక్కించుకున్నారు. పైపుల కంపెనీ వద్ద నిర్మానుష్య ప్రదేశంలో శేఖర్‌ తనవెంట తీసుకొచ్చిన కత్తితో వెంకట్‌రెడ్డి గొంతు, వీపుపై పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సీసీ కెమెరాలు, కాల్‌డేటా ఆధారంగా కేసు చేధించిన పోలీసులు... నిందితులను అరెస్ట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !