కిషన్ రెడ్డిని అభినందించిన ప్రధాని నరేంద్ర మోడీ.. కారణమేంటంటే..?

Siva Kodati |  
Published : Feb 25, 2023, 02:41 PM IST
కిషన్ రెడ్డిని అభినందించిన ప్రధాని నరేంద్ర మోడీ.. కారణమేంటంటే..?

సారాంశం

సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమలు చేస్తున్న ‘హెల్తీ బేబీ షో’ అనే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు దక్కాయి.  

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోడీ. చిన్నారుల ఆరోగ్యంపై సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి చేపట్టిన ‘హెల్తీ బేబీ షో’ అనే కార్యక్రమాన్ని మోడీ అభినందించారు. ఇది చిన్నారులకు ఎంతో మేలు చేస్తుందని కిషన్ రెడ్డిని ప్రశంసించారు. దీనిపై కిషన్ రెడ్డి వెల్లడించారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి కాలనీ, ప్రతి బస్తీ, ప్రతి హౌసింగ్ సొసైటీలోనూ ‘హెల్తీ బేబీ షో’కు సంబంధించిన అప్లికేషన్‌లను పంపినట్లు తెలిపారు. ఆరోగ్యంగా వున్న చిన్నారుల పేరెంట్స్‌కు సన్మానం చేయడంతో పాటు వారికి సర్టిఫికెట్లు అందజేశామని.. అలాగే వారికి పోషణ్ కిట్లు ఇచ్చి చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారిస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. చిన్నారులకు ఇచ్చే కిట్లలో ప్రోటీన్ పౌడర్, ప్రోటీన్ బిస్కట్లు, నెయ్యి, ఖర్జూరాలతో పాటు డైపర్లు , ఒక బొమ్మ, ఫోటో ఫ్రేమ్ వున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

ఇదిలావుండగా.. కిషన్ రెడ్డి  ఇంట విషాదం నెలకొంది. ఆయన అల్లుడు జీవన్ రెడ్డి(47) గురువారం రాత్రి తుది శ్వాసవిడిచారు. జీవన్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కిషన్ రెడ్డి అక్క బావా లక్ష్మీ, నర్సింహా రెడ్డి హైదరాబాద్ సైదాబాద్‌లో నివాసముంటారు.వారి కుమారుడే జీవన్‌రెడ్డి. గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జీవన్ రెడ్డి ఒక్కసారి కుప్పకూలి పోయారు. వెంటనే కుటుంబ సభ్యులు సంతోష్ నగర్ డీఆర్‌డీఎల్ అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ..చికిత్స పొందుతూ జీవన్‌రెడ్డి కన్నుమూశారు. ఆయన మృతితో సైదాబాద్‌లో విషాద ఛాయలు ఏర్పడ్డాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్