కేసీఆర్‌కు ప్రధాని మోడీ ఫోన్.. కరోనాపై కీలక చర్చ

By Siva KodatiFirst Published May 6, 2021, 8:50 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాని నరేంద్రమోడీ గురువారం ఫోన్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్ధితులపై మోడీ చర్చించారు. అంతకుముందు ప్రధాని నరేంద్రమోడీ కేంద్ర మంత్రులు, అధికారులతో కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాని నరేంద్రమోడీ గురువారం ఫోన్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్ధితులపై మోడీ చర్చించారు. అంతకుముందు ప్రధాని నరేంద్రమోడీ కేంద్ర మంత్రులు, అధికారులతో కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రాలు, జిల్లాల వారీగా కరోనా కేసులపై  ఆయన సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య, మౌలిక సదుపాయాలు పెంచడానికి రాష్ట్రాలకు సహకారం అందిస్తామని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల్లో కరోనా మందుల లభ్యతపై కూడ చర్చించారు. 

దేశంలో వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును మోడీ అడిగి తెలుసుకొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో  టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మోడీ కోరారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడంపై రోడ్ మ్యాప్ పై ఆయన చర్చించారు.

Also Read:కరోనా నుండి కోలుకొన్న కేసీఆర్: నేడు ప్రగతి భవన్ లో కోవిడ్ పై సమీక్ష

రాష్ట్రాలకు 17.7 కోట్ల టీకాలు సరఫరా చేసిన విషయాన్ని అధికారులు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. టీకాలు ఏ రాష్ట్రంలో వృధా అయ్యాయనే విషయమై కూడ ఆయన ఆరాతీశారు. లాక్‌డౌన్ ఉన్నా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మోడీ  సూచించారు. 

కాగా, కరోనా నుండి  తెలంగాణ సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకొన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ తొలిసారిగా గురువారం నాడు ప్రగతి భవన్ కు చేరుకున్నారు. అనంతరం కరోనాపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవలే సీఎం కేసీఆర్ కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే.

click me!