జీవో నెం. 317 రగడ: బండి సంజయ్‌కి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్.. అరెస్ట్‌పై ఆరా

By Siva KodatiFirst Published Jan 8, 2022, 8:12 PM IST
Highlights

బండి సంజయ్‌కి ఫోన్ చేసిన మోదీ దాదాపు 15 నిమిషాల పాటు సంభాషించారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే బండి సంజయ్ ఇటీవల చేపట్టిన జాగరణ దీక్ష , అరెస్ట్ తదితర అంశాల గురించి చర్చించారు.

తెలంగాణ బీజేపీ (bjp) చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) జాగరణ దీక్ష, అరెస్ట్, విడుదల తదితర అంశాలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇదే అదనుగా బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూకట్టారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ (raman singh) , మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లు (shivraj singh chouhan) తెలంగాణకు వచ్చి.. కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశాలన్నీ ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) దృష్టికి వెళ్లాయి. ఈ క్రమంలో శనివారం ఆయన బండి సంజయ్‌తో స్వయంగా మాట్లాడారు. బండి సంజయ్‌కి ఫోన్ చేసిన మోదీ దాదాపు 15 నిమిషాల పాటు సంభాషించారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే బండి సంజయ్ ఇటీవల చేపట్టిన జాగరణ దీక్ష , అరెస్ట్ తదితర అంశాల గురించి చర్చించారు.

అంతకుముందు శనివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని కేసీఆర్ సర్కారుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఉద్యోగ బదిలీలకు సంబంధించి 317 జీవో (go no 317) సవరించాలని డిమాండ్ చేస్తూ మరోమారు కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. వంద‌లాది మంది బ‌లి దానాల ఫ‌లితంగా వ‌చ్చిన .. తెలంగాణ ఎవరికోసమని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవో పుణ్యమాని కరీంనగర్‌లో పనిచేసే కానిస్టేబుల్ మహబూబ్‌నగర్‌లో పనిచేయాల్సిన వ‌చ్చింది.  నల్గొండలో పనిచేసే టీచర్, ఏఎస్సై, ఎస్సై ఆదిలాబాద్ జిల్లాకు పోవాల్సి పరిస్థితి దాపురించింద‌ని అన్నారు. తెలంగాణ స‌ర్కార్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. "కేసులు, అరెస్టులే మీ ఆయుధంగా మారితే..  జైళ్లే.. మా అడ్డాగా మారుతాయి. అక్క‌డి నుంచే ఉద్యమిస్తాం" అని  బండి సంజయ్‌ హెచ్చరించారు. తన‌కు  జైళ్లు కొత్తకాదనీ, దాదాపు  9 సార్లు జైలుకు పోయివ‌చ్చిన‌నీ, అదే బ్యారక్లో ఉన్నా. మళ్లీ పోరాటం చేసి జైలుకు వెళ్లాడానికి సిద్ధంగా ఉన్న‌నని ప్రకటించారు.  

త‌న‌ కార్యాలయంలో శాంతియుతంగా జాగరణ చేసుకుంటే.. కేసీఆర్ స‌ర్కార్ కు వ‌చ్చిన  నొప్పి ఏంట‌ని ప్ర‌శ్నించారు. వాటర్‌ క్యాన్లు కొడతావా? టియర్‌ గ్యాస్‌ వదులుతావా? గ్యాస్‌ కట్టర్లు పెట్టి గేట్లు బద్దలు కొట్టిస్తవా? అని నిల‌దీశారు బండి సంజ‌య్. కేసీఆర్ మిమ్ముల‌న్నీ వదలా.. ప్ర‌జ‌ల కేసీఆర్ నే జైలుకు పంపాల‌ని కోరుకుంటున్నార‌ని అన్నారు. 317 జీవో వల్ల ఉపాధ్యాయులంతా బాధపడుతున్నార‌నీ,   అందుకే త‌న‌ రక్తం మరుగుతోందని అన్నారు.

బీజేపీ కార్యకర్తల మీద ఈగ వాలినా నిప్పుకణికలై విజృంభిస్తామని హెచ్చరించారు. బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు  రాష్ట్ర, జాతీయ నాయకత్వం మొత్తంవెంట ఉంటుంద‌నీ, ప్ర‌తి కార్య‌క‌ర్త‌ను నాయ‌క‌త్వం గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటుంద‌ని అన్నారు. అధికార బలంతో త‌మ‌పై అక్ర‌మ కేసులు పెడితే.. ఊరుకోమ‌ని మండిప‌డ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో గ‌డీల పాల‌న‌, రాజుల పాల‌న నడవదని అన్నారు. కేసీఆర్ ఎంత అణచాలని చూస్తే.. అంత పైకి లేస్తామ‌ని అన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లే.. కేసీఆర్ కు  రాజకీయ సమాధి చేస్తార‌నీ, కేసీఆర్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు చరమగీతం పాడుతార‌ని బండి సంజయ్ తీవ్ర హెచ్చరికలు చేశారు.

అన్యాయంగా,అక్రమంగా కార్యకర్తలపై పోలీసులతో దాడి చేయించి దారుణంగా కొట్టించారన్నారు. అక్రమ కేసులు బనాయించిన ఓ నియంత కేసీఆర్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ స‌ర్కార్ పై బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ ధ్వజమెత్తారు. కేసీఆర్‌ది మూగ–చెవిటి ప్రభుత్వమని విమ‌ర్శించారు.  కేసీఆర్‌ఉడుత ఊపులకు బీజేపీ భయపడేప్రసక్తే లేదనీ,  సంజయ్‌ నాయకత్వంలో కార్యకర్తలు చేస్తున్న పోరాటం ఆగదనీ,  సంజయ్‌ అరెస్టు చూస్తుంటే జలియ‌న్ వాలాబాగ్‌ను తలపించింది. సీఎం నుంచి ఫోన్‌ వచ్చినా వెంట‌నే.. గేట్లు బద్దలు కొట్టి అరెస్టు చేశారని  అన్నారు.

click me!