తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. ప్రధాని మోడీ ఏమ‌న్నారంటే.. ?

Published : Dec 07, 2023, 06:10 PM ISTUpdated : Dec 07, 2023, 06:12 PM IST
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. ప్రధాని మోడీ ఏమ‌న్నారంటే.. ?

సారాంశం

Telangana: తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ స‌ర్కారు కొలువుదీరింది. ఉప ముఖ్యమంత్రిగా దళిత నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 

Prime Minister Narendra Modi: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనుముల‌ రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్  నాయ‌కుడు రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్ రెడ్డితో పాటు మ‌రో 10 మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని మోడీ స్పందిస్తూ శుభాకాంక్ష‌లు తెలిపారు. 

ఎక్స్ లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్పందిస్తూ.. "తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి  అభినందనలు" తెలిపారు. రాష్ట్ర ప్రగతికి, ప్రజల సంక్షేమానికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

 

 

రేవంత్ రెడ్డితో క‌లిసి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన 11 మంది తెలంగాణ‌ మంత్రులు వీరే

ఒకప్పుడు తుపాకీ పట్టిన మావోయిస్టు.. ఇప్పుడు తెలంగాణ మంత్రిగా సీత‌క్క

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?