మరోసారి తెలంగాణాకు ప్రధాని మోడీ.. ఈ సారి ఆ ఆంశంపై కీలక ప్రకటన !  

By Rajesh Karampoori  |  First Published Nov 8, 2023, 8:19 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రచారంలో జాతీయ నాయకులు పాల్గొంటూ ప్రచారం జోరును మరింత పెంచుతున్నారు. మరోవైపు తెలంగాణ ఎన్నికలపై ప్రధాని మోడీ ఫోకస్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. 


తెలంగాణలో ఎన్నికలు (TS Elections) సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.  ఎలాగైనా అధికారం కైవసం చేసుకోవాలని బీజేపీ   ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఢీ అంటే ఢీ అనేలా పోటీ పడుతుంది. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, అసంతృప్తుల నేతల పార్టీ ఫిరాయింపులు జరుగుతున్న నేపథ్యంలో కార్యకర్తలకు బూస్ట్ ఇచ్చేందుకు అగ్రనాయకత్వం రంగం సిద్ధం చేసింది. వరుసగా పార్టీ అగ్ర నేతలు పర్యటనలు చేస్తూ.. జోష్ పెంచుతున్నారు.  ముఖ్యంగా తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్న తీరు ఆసక్తి పరుస్తోంది.  

కేవలం నాలుగు రోజుల వ్యవధిలో రాష్ట్రంలో రెండోసారి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నరు. ఈనెల 7న జరుగనున్న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొన్నారు. ఈ తరుణంలో బిసి అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తుందని ప్రకటించారు. ఇక తాజాగా మరో మారు ఈ నెల 11 న తెలంగాణ పర్యటించనున్నారు. ఈసారి ప్రధాని మోడీ మాదిగ విశ్వరూప బహిరంగ సభలో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే.. ఎస్సీ వర్గీకరణపై ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మాదిగలు శుభవార్త అందించేలా దీనిపై కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తుంది.

Latest Videos

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ వరుస పర్యటనలు చేయడం, ఈ తరుణంలో కీలక ప్రకటనలు చేయడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఒకవేళ మాదిగల వర్గీకరణపై ప్రధాన మోడీ ప్రకటన చేస్తే ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.  

షెడ్యూల్ ఖరారు

ఈ మేరకు ప్రధాని మోడీ అధికార షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. నవంబర్ 11 సాయంత్రం 4- 45 ప్రాంతంలో ప్రధాని మోడీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో పెరేడ్ గ్రౌండ్ మైదానానికి వెళతారు. మైదానంలో జరిగే మాదిగా విశ్వరూప బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమ అనంతరం సాయంత్రం 5-55 ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని..సాయంత్రం 6 గంటలకు మోడీ ఢిల్లీకి పయాణమవుతారు. 
 

click me!