PM Modi to visit Telangana: త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న వేళ.. ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణలో కూడా పర్యటించనున్నారు. పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు.
PM Modi to visit Telangana: త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వేళ.. ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. భారీ ఎత్తున ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో చేస్తు బిజీబిజీగా సాగుతున్నాడు. ఇటీవల తమిళనాడులో పర్యటించిన ప్రధాని మోడీ.. మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు.మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు.
షెడ్యూల్ ప్రకారం మార్చి 4న ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించి పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, కొత్త అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మార్చి 5న సంగారెడ్డి జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అదనపు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, కొత్త వాటికి శంకుస్థాపనలు, మరో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
undefined
పూర్తి షెడ్యూల్ ఇదే..
వచ్చే నెల 4, 5 తేదీల్లో రెండు రోజులపాటు మోదీ పర్యటన కొనసాగనుంది. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోదీ పర్యటిస్తారు. మార్చి 4న మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్‌కు చేరుకుని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో మోదీ పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించి, కార్యక్రమం అనంతరం మహారాష్ట్రలోని నాందేడ్‌కు బయలుదేరి వెళతారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఆదిలాబాద్-బేల మధ్య రోడ్డు పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని, రామగుండంలో ఎన్‌టీపీసీ కొత్త ప్లాంట్‌ను ప్రారంభిస్తారని తెలిపారు.
మార్చి 5న సంగారెడ్డి నుంచి ఉదయం 10.45 గంటలకు సంగారెడ్డికి చేరుకునే మోదీ, సంగారెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ఉదయం 11.30 గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని సంగారెడ్డి హెలిప్యాడ్ నుంచి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరి వెళతారు. తర్వాత ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.