ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన తేదీలో మార్పు.. ఒక రోజు వాయిదా

Published : Sep 23, 2023, 09:10 PM IST
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన తేదీలో మార్పు.. ఒక రోజు వాయిదా

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఒక రోజు వాయిదా పడింది. సెప్టెంబర్ 30వ తేదీన కాకుండా ఆయన అక్టోబర్ 1వ తేదీన తెలంగాణకు రానున్నారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించే సభలో ఆయన పాల్గొంటారు.  

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఒక రోజు వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెలాఖరుకు అంటే సెప్టెంబర్ 30వ తేదీన ఆయన తెలంగాణకు రావాలి. కానీ, మారిన షెడ్యూల్ ప్రకారం ఆయన అక్టోబర్ 1వ తేదీన తెలంగాణకు వస్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్‌లో బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభకు మోడీ హాజరై మాట్లాడుతారు. 

తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన బీజేపీ ఇప్పుడు కార్యాచరణకు పదును పెడుతున్నది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోడీ సహా, పార్టీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలు తరుచూ తెలంగాణ పర్యటించి బహిరంగ సభల్లో ప్రసంగించే ప్రణాళికలు వేస్తున్నారు. శాసన ఎన్నికల కార్యాచరణను బహుముఖ వ్యూహంతో ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Also Read: హుస్నాబాద్‌లో తప్పకుండా బరిలో దిగుతాం.. కాంగ్రెస్‌తో పొత్తుపై చర్చలు: చాడ వెంకట్‌రెడ్డి

ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 1వ తేదీన మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతోనూ బహిరంగ సభలు నిర్వహించాలనే నిర్ణయాలు బీజేపీ తీసుకున్నట్టు తెలిసింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?