హుస్నాబాద్‌లో తప్పకుండా బరిలో దిగుతాం.. కాంగ్రెస్‌తో పొత్తుపై చర్చలు: చాడ వెంకట్‌రెడ్డి

By Mahesh K  |  First Published Sep 23, 2023, 7:55 PM IST

హుస్నాబాద్ నియోజకవర్గంలో సీపీఐ కచ్చితంగా పోటీ చేస్తుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తుపై జాతీయ నాయకత్వం చర్చలు కొనసాగిస్తున్నదని వివరించారు. తెలంగాణలో సీపీఐ బలంగా ఉన్నదని తెలిపారు.
 


హైదరాబాద్: సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఐ బలంగా ఉన్న స్థానాల్లో తప్పకుండా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాల చరిత్ర తమ పార్టీకి ఉన్నదని వివరించారు. హుస్నాబాద్‌లో ఆరుసార్లుగా గెలిచిన చరిత్ర తమదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్‌లో సీపీఐ కచ్చితంగా పోటీ చేస్తుందని చెప్పారు.

హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకట్ రెడ్డి మాట్లాడారు. కమ్యూనిస్టులపై గౌరవం లేకపోతే మొత్తం ప్రజలపై గౌరవం లేనట్టేనని సూత్రీకరించారు. మహిళా బిల్లును ఇప్పుడు పార్లమెంటులోకి తేవడాన్ని ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శలు సంధించారు. మహిళా బిల్లును బీజేపీ ఎన్నికల అస్త్రంగా మార్చుకుందని తెలిపారు. 

Latest Videos

కాగా, కాంగ్రెస్ పొత్తులపైనా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐల మధ్య పొత్తు పై జాతీయ నాయకత్వం చర్చలు జరుపుతున్నదని వివరించారు. 

Also Read: కాషాయరంగులో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకంటే?

కాగా, హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పార్టీల కలిసే పోటీ చేస్తాయని వివరించారు. సీట్ల పంపకాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. అయితే.. కాంగ్రెస్ పై పొత్తు లేదని ఇప్పుడు చెప్పడం లేదని పేర్కొన్నారు.

click me!