ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా..

Published : Jan 11, 2023, 11:31 AM IST
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా..

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ ఈ నెల 19న తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉంది.

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ ఈ నెల 19న తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉంది. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ రైలును ప్రారంభించడంతో పాటుగా,  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అభివృద్ది పనులకు శంకుస్థాప‌న చేయాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ప్రధాని మోదీ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాచారం అందింది. మళ్లీ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు ఎప్పుడు వచ్చేదానిపై త్వరలోనే వివరాలు తెలియజేస్తామని పీఎంవో తెలియజేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?