రూ.50వేలు ఖరీదైన పిల్లి చోరీ...!

Published : Jan 11, 2023, 10:48 AM IST
 రూ.50వేలు ఖరీదైన పిల్లి చోరీ...!

సారాంశం

ఆ పిల్లిని కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమగా చూసుకున్నారు.  ఈ నెల 8వ తేదీన ఆ పిల్లి అదృశ్యమైంది. ఓ వ్యక్తి బైక్ పై వచ్చి దానిని ఎత్తుకువెళ్లడం గమనార్హం. 

పెంపుడు జంతువుగా పిల్లిని పెంచుకోవడం చాలా కామన్ గా జరిగే విషయమే. అయితే... ఓ కుటుంబం కూడా అంతే ఓ పిల్లిని అపురూపంగా పెంచుకుంది. అయితే... అనుకోకుండా...ఆ పిల్లిని ఎవరో ఎత్తుకెళ్లారు. దీంతో... యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే....హైదరాబాద్ నగరంలోని  జహంగీర్  నగర్ కాలనీ కి చెందిన మహమూద్  అనే వ్యక్తి 18 నెలల క్రితం  ఓ పిల్లిని తెచ్చుకొని పెంచుకుంటున్నాడు.అది విదేశీ పిల్లి కావడం గమనార్హం. ఆ పిల్లిని కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమగా చూసుకున్నారు.  ఈ నెల 8వ తేదీన ఆ పిల్లి అదృశ్యమైంది. ఓ వ్యక్తి బైక్ పై వచ్చి దానిని ఎత్తుకువెళ్లడం గమనార్హం. వ్యక్తి దానిని ఎత్తుకువెళ్లినట్లు సీసీ టీవీ కెమేరాలో రికార్డు అయ్యింది.  దీంతో... యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

చోరీకి గురైన పిల్లి అరుదైన హౌ మనీ రకానికి చెందినదని యజమాని చెప్పాడు. పిల్లి ఒక కన్ను బ్లూ..మరో కన్ను గ్రీన్ రంగులో ఉండటం దీని ప్రత్యేకతని చెప్పాడు.దీని ఖరీదు సుమారు రూ.50 వేల వరకూ ఉంటుందని తెలిపాడు. దీని కోసం... పోలీసులు గాలిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా
School Holidays: స్కూళ్లకు వరుస సెలవులు.. విద్యార్థులకు డబుల్ ధమాకా