హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టు:దళితబంధుపై తెలంగాణ హైకోర్టులో పిల్

Published : Jul 30, 2021, 03:56 PM IST
హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టు:దళితబంధుపై తెలంగాణ హైకోర్టులో పిల్

సారాంశం

దళితబంధు పథకం కోసం హుజూరాబాద్ ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ  తెలంగాణ హైకోర్టులో శుక్రవారం నాడు పిల్ దాఖలైంది. జనవాహిని, జైస్వరాజ్, తెలంగాణ రిపబ్లిక్ పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి.

హైదరాబాద్: దళితబంధు పథకంపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం నాడు  పిల్ దాఖలైంది. జనవాహిని, జైస్వరాజ్, తెలంగాణ రిపబ్లిక్ పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పథకాన్ని  హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టడం సరికాదని పిల్ దాఖలు చేశారు.మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి.

 తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం తీసుకురావాలని సంకల్పించింది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం హుజూరాబాద్ లో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని సీఎం ప్రకటించారు.

 ఉప ఎన్నికల్లో లబ్ది కోసమే హుజూరాబాద్ లో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో హైకోర్టులో పిల్ దాఖలైంది.కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలతో పాటు ఈసీ, తెలంగాణ ప్రభుత్వాన్ని  ప్రతివాదులుగా చేశారు పిటిషనర్లు.రైతు బంధు పథకం తరహలోనే దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.


 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?