మేఘా కంపెనీకి డబ్బులిస్తేనే కేసీఆర్‌కు కమిషన్లు : షర్మిల ఘాటు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 30, 2021, 3:09 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైయస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టులను రీడిజైన్ చేసి కాంట్రాక్టర్లకు కట్టబెడితే కేసీఆర్ కు కమిషన్లు వస్తాయని చెప్పారు. మేఘా కంపెనీ కట్టే ప్రాజెక్టులకు డబ్బులు ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు వస్తాయని షర్మిల ఆరోపించారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైయస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. శుక్రవారం ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ... రైతులకు పంట నష్టపరిహారం ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు రావని, యువతకు కార్పొరేషన్ లోన్లు ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు రావని, డిస్కంలకు డబ్బులు చెల్లిస్తే కేసీఆర్ కు కమిషన్లు రావని, ఉద్యోగులకు బిల్లులు చెల్లిస్తే కేసీఆర్ కు కమిషన్లు రావని ఆమె అన్నారు.

కానీ, ప్రాజెక్టులను రీడిజైన్ చేసి కాంట్రాక్టర్లకు కట్టబెడితే కేసీఆర్ కు కమిషన్లు వస్తాయని చెప్పారు. మేఘా కంపెనీ కట్టే ప్రాజెక్టులకు డబ్బులు ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు వస్తాయని షర్మిల ఆరోపించారు. కమిషన్లకు కక్కుర్తిపడి అక్కరకు రాని పనులు చేస్తే గిట్లనే ఉంటది కేసీఆర్ దొర అంటూ షర్మిల విమర్శించారు.

మరోవైపు ప్రతి మంగళవారం షర్మిల నిరుద్యోగ దీక్షలను చేపడుతున్న సంగతి తెలిసిందే. నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆమె మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు

 

రైతులకు పంట నష్టపరిహారం ఇస్తే KCRకు కమిషన్లు రావు ..
యువతకు కార్పొరేషన్ లోన్లు ఇస్తే KCRకు కమిషన్లు రావు ..
డిస్కంలకు డబ్బులు చెల్లిస్తే KCRకు కమిషన్లు రావు ..
ఉద్యోగులకు బిల్లులు చెల్లిస్తే KCRకు కమిషన్లు రావు .. 1/2

— YS Sharmila (@realyssharmila)
click me!