ఫోన్ ట్యాపింగ్ కేసు: ఇద్దరు మాజీ పోలీసు అధికారులకు లుకౌట్ నోటీసులు

By narsimha lode  |  First Published Mar 24, 2024, 10:47 AM IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో  ఆదివారంనాడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు మాజీ పోలీస్ అధికారులకు సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
 


హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో  ఆదివారం నాడు కీలక పరిణామం చోటు చేసుకుంది.  ఎస్ఐబీ మాజీ చీఫ్,  టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై లుకౌట్ నోటీస్ జారీ చేసింది సిట్.

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విపక్ష పార్టీలకు చెందిన నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారని అప్పట్లో రేవంత్ రెడ్డి ఆరోపించారు.  రేవంత్ రెడ్డి అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు.

Latest Videos

undefined

గత ఏడాది నవంబర్ మాసంలో  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశంపై  విచారణ ప్రారంభమైంది.ఈ కేసులో  ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ కేసును విచారించేందుకు  సిట్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రణీత్ రావును  వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని  సిట్ బృందం  విచారించింది.  మరో వైపు ఈ నెల  23న  అడిషనల్ ఎస్పీలు  భుజంగరావు,  తిరుపతన్నలను కూడ  సిట్ బృందం  అరెస్ట్ చేసింది.  ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలను  సిట్ బృందం జడ్జి ముందు హాజరుపర్చారు. 

మరో వైపు  ఫోన్ ట్యాపింగ్ కేసులో  ఆరోపణలు ఎదుర్కొంటున్న  ఎస్ఐబీ మాజీ చీఫ్  ప్రభాకర్ రావు,  టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ  రాధాకిషన్ రావులకు  సిట్ బృందం లుకౌట్ నోటీసులు జారీ చేసింది.

ఫోన్ ట్యాపింగ్ అంశంపై  పోలీసుల విచారణ విషయం తెలుసుకొని ఈ ఇద్దరు  విదేశాలకు  పారిపోయినట్టుగా ప్రచారం సాగుతుంది. దీంతో  సిట్ బృందం  లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ప్రభాకర్ రావు,  రాధాకిషన్ రావు సహా హైద్రాబాద్ లోని  10 చోట్ల  సిట్ బృందం  సోదాలు నిర్వహించింది.  ఫోన్ ట్యాపింగ్ చేయాలని ప్రణీత్ రావును ఎవరు ఆదేశించారనే విషయమై  సిట్ బృందం  విచారణ చేస్తుంది.  


 

click me!