Kinjarapu Atchannaidu Biography: టెక్కలి ప్రజలకు ఒక్కసారి ఫోన్ కాల్ దూరంలో ఉండే నేత అచ్చం నాయుడు.. తన నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన ఎన్నో సంక్షేమ పథకాలను తన నియోజకవర్గ ప్రజలందరికీ చేరేలా చేసి.. టెక్కలిని తన కంచుకోటగా మార్చుకున్నారు. నేపథ్యంలో అచ్చం నాయుడు వ్యక్తిగత, రాజకీయ జీవిత చరిత్రను తెలుసుకుందాం..
Kinjarapu Atchannaidu Biography: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా టీడీపీలో కింజరాపు కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దివంగత నేత కింజరాపు ఎర్రం నాయుడు టిడిపి పార్టీలో కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సోదరుడు అచ్చం నాయుడు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ.. సోదరుడి అడుగుజాడల్లో నడుస్తున్నారు. అచ్చెం నాయుడు టీడీపీలో కీలక నేతగా ఎదిగిన తీరును తెలుసుకుందాం..
బాల్యం విద్యాభ్యాసం
కింజరాపు అచ్చంనాయుడు.. మార్చి 26 1971న శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నిమ్మాడ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు దారి నాయుడు-కళావతి నాయుడు. ఆయన పాఠశాల విద్యాభ్యాసం అంత టెక్కలిలో జరిగింది. అనంతరం విశాఖపట్నంలోని కృష్ణ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు.
రాజకీయ జీవితం
విద్యార్థి దశ నుంచే అచ్చం నాయుడు రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ద్వారా అచ్చం నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. హరిచంద్రపురం నియోజకవర్గ నుంచి అచ్చం నాయుడు తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు. 1994లో ఎన్టీఆర్ పోటీ చేసిన రెండు స్థానాల్లో హరిచంద్ర పురం ఒకటి. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ 40 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేశారు. అప్పుడు ఎర్రం నాయుడు ఆ స్థానం నుంచి బరిలో నిలిచి గెలుపొందారు.గతంలో 1983, 1985,1989లో కూడా ఎర్రం నాయుడు ఆ స్థానం నుంచి గెలుపొందారు. అందుకే ఈ కుటుంబానికి హరిచంద్ర పురం కంచుకోటగా మారింది. 1996 ఉప ఎన్నికల్లో ఎర్రం నాయుడు సోదరుడు అచ్చం నాయుడు రాజకీయ ఎంట్రీ ఇచ్చారు . ఈ ఎన్నికల్లో బరిలో నిలిచిన అచ్చెం నాయుడు గెలుపొందారు ఎమ్మెల్యే అయ్యారు.
ఆ తరువాత 1999, 2004 ఎన్నికల్లో కూడా అచ్చెం నాయుడు గెలుపొందారు. అయితే.. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో హరిచంద్రపురం నియోజకవర్గ టెక్కలిగా మారింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో అచ్చెం నాయుడుకి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి రేవతీపతి పై పోటీచేసి ఓడిపోయారు. అయితే ప్రమాణ స్వీకారానికి ముందే రేవతి పతి ఆకస్మికంగా మరణించారు. దీంతో మరోసారి ఉప ఎన్నికలు జరిగగా.. ఆ ఎన్నికల్లో అచ్చం నాయుడు మరోసారి రేవతి భార్య భారతి పై పోటీ చేసి పరాజ్యం పాలయ్యారు.
ఇక, రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున టెక్కలి నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా గెలుపొందారు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో గల ఏడు శాసన సభ నియోజకవర్గాలలో ఒక్క పాతపట్నం శాసనసభ నియోజకవర్గం తప్ప అన్నింటిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందడంలో కృషి చేసిన అచ్చెం నాయుడును చంద్రబాబు తన కేబినెట్ లోకి తీసుకున్నారు. ఆయనకు కార్మిక శాఖ బాధ్యతలను అప్పగించారు.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున టెక్కలి నియోజకవర్గ నుంచి పోటీ చేసి వైసిపి అభ్యర్థి పేరాల తిలక్ పై విజయం సాధించారు అచ్చన్న. కానీ, ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. టిడిపి ఓటమిపాలైంది. దీంతో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ టీడీపీ రథసారధిగా అవకాశం కల్పించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ,జనసేన, బీజేపీల కూటమి ఆయనను టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దించనున్నది.
వివాదాలు
ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చం నాయుడు అరెస్టు అయ్యారు. టిడిపి హయాంలో అచ్చెం నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు . ఈ కేసులో అచ్చెం నాయకుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం 19 మంది పై కేసు నమోదు అయింది.