ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావు అరెస్ట్

By narsimha lode  |  First Published Mar 29, 2024, 10:28 AM IST


ఫోన్ ట్యాపింగ్ విషయంలో  హైద్రాబాద్ టాస్క్ ఫోర్స్  మాజీ డీసీపీ  రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.



హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్ కేసులో  కీలక పరిణామం చోటు చేసుకుంది.  హైద్రాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.  గురువారం నాడు బంజారాహిల్స్ పోలీసులు  రాధాకిషన్ రావును  సుమారు  ఎనిమిది గంటలకు పైగా విచారించారు.గురువారం నాడు రాత్రి  రాధాకిషన్ రావును బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నాడు మేజిస్ట్రేట్  ముందు రాధాకిషన్ రావును హాజరుపర్చనున్నారు పోలీసులు.

గురువారం నాడు ఉదయం నుండి శుక్రవారం నాడు ఉదయం వరకు  ఓ సీఐ ను కూడ  పోలీసులు విచారించారు. పోన్ ట్యాఫింగ్ విషయమై ఆ సీఐను  పోలీసులు విచారించారు.ఈ నెల  24వ తేదీన  టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ  రాధాకిషన్ రావు,  ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావులకు  పోలీసులు  లుకౌట్ నోటీసులు జారీ చేశారు.  దరిమిలా  రాధాకిషన్ రావు  బంజారాహిల్స్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. విచారణ తర్వాత రాధాకిషన్ రావును  పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన విషయమై  పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే  ప్రణీత్ రావు,  భుజంగరావు,  తిరుపతన్నలను అరెస్ట్ చేశారు. తాజాగా  రాధాకిషన్ రావును  అరెస్ట్ చేశారు.  

Latest Videos

గతంలో తన ఫోన్ ను కూడ ట్యాపింగ్ చేశారని బీజేపీ నేత రఘునందన్ రావు  రెండు రోజుల క్రితం డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  కూడ  తన ఫోన్ ట్యాపింగ్ చేశారని  ఆరోపించారు.

click me!