పీజీటీ ఇంగ్లీష్ ఆన్ లైన్ పరీక్షకు సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. సర్వర్ లో ఇబ్బందుల కారణంగా పరీక్షకు అభ్యర్థులను అనుమతించలేదు.
హైదరాబాద్: గురుకుల పీజీటీ ఇంగ్లీష్ ఆన్ లైన్ పరీక్షలో సాంకేతిక సమస్య నెలకొంది. దీంతో హైద్రాబాద్ హయత్ నగర్ లోని పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు.దీంతో హైద్రాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఇవాళ ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే సర్వర్ లో సాంకేతిక సమస్య కారణంగా పరీక్ష ప్రారంభం కాలేదు. దీంతో పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. సాంకేతిక సమస్యల కారణంగా పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించలేదు. దీంతో పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్ద బైఠాయించి నిరసనకు దిగారు.
హైద్రాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై అభ్యర్థులు ధర్నా చేశారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అభ్యర్థులకు పోలీసులు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు , మధ్యాహ్నం రెండు గంటలకు కూడ పరీక్షలున్నాయి.దరిమిలా ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారని అభ్యర్థులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.