వైఎస్ షర్మిలతో ఆళ్ళ రామకృష్ణారెడ్డి భేటీ: ఏం జరుగుతోంది?

By narsimha lodeFirst Published Feb 11, 2021, 4:57 PM IST
Highlights

వైఎస్ షర్మిలతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం నాడు భేటీ అయ్యారు. తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు కోసం సన్నాహలు చేస్తున్న సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.


హైదరాబాద్: వైఎస్ షర్మిలతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం నాడు భేటీ అయ్యారు. తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు కోసం సన్నాహలు చేస్తున్న సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది.  షర్మిలతో పాటు బ్రదర్ అనిల్ తో కూడ ఆయన సమావేశమయ్యారని తెలుస్తోంది.
సుదీర్థంగా ఈ భేటీ జరిగింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతో  భేటీ కావడం చర్చకు  దారితీస్తోంది. వీరిద్దరి మధ్యభేటీకి సంబంధించిన విషయాలు  తెలియాల్సి ఉంది.  

రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమావేశాన్ని షర్మిల ప్రారంభించారు. తొలుత నల్గొండ జిల్లా నేతలతో ఆమె సమావేశమయ్యారు.ఈ నెల 20వ తేదీన ఖమ్మం జిల్లా నేతలతో ఆమె సమావేశం కానున్నారు. ఈ ఏడాది మార్చిలో షర్మిల పార్టీని ప్రకటించే అవకాశం ఉంది.ఈ లోపుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నేతలతో  షర్మిల భేటీ కావాలని నిర్ణయం తీసుకొన్నారు.

click me!