ఓటర్లకు డబ్బుల పంపిణీ.. మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు జైలు శిక్ష, జరిమానా

By Siva KodatiFirst Published Aug 12, 2021, 7:11 PM IST
Highlights

ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిన అభియోగంపై పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు  6 నెలల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ  ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించింది. ఆయన అప్పీలకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతిస్తూ.. జైలు శిక్ష నిలిపివేసింది.  
 
పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ప్రజాప్రతినిధుల కోర్టు షాకిచ్చింది. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినట్టు అశ్వరావుపేట పోలీస్‌ స్టేషన్‌లో 2018లో కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ సందర్భంగా అభియోగం రుజువు కావడంతో న్యాయస్థానం ఇవాళ తీర్పు వెల్లడించింది. దీనిలో భాగంగా 6 నెలల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాయం వెంకటేశ్వర్లు రూ.10వేల జరిమానా చెల్లించారు. ఇదే సమయంలో ఆయన అప్పీలకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతిస్తూ.. జైలు శిక్ష నిలిపివేసింది.  

ఇక ఇదే తరహా కేసులో టీఆర్ఎస్ నేత, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు కూడా కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించింది. 2019 ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేశారన్న కేసులో భాగంగా కోర్టు ఈ తీర్పు వెలువరించింది. మాలోత్ కవితపై 2019లో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టు తీర్పు మేరకు రూ.10 వేల జరిమానాను చెల్లించారు ఎంపీ మాలోత్ కవిత. అదే సమయంలో ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 

click me!