ఇక వరంగల్, హన్మకొండ జిల్లాలు: ప్రభుత్వం తుది నోటిఫికేషన్

Published : Aug 12, 2021, 06:27 PM IST
ఇక వరంగల్, హన్మకొండ జిల్లాలు: ప్రభుత్వం తుది నోటిఫికేషన్

సారాంశం

రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తూ తుది నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసింది. దీని ప్రకారం, ఈ రెండు జిల్లాలు ఇక నుంచి హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మారాయి. 14 మండలాలతో హన్మకొండ, 13 మండలాలతో వరంగల్ జిల్లాలుగా ఏర్పడ్డాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలను వరంగల్, హన్మకొండ జిల్లాలుగా పునర్వ్యస్థీకరించింది. పేర్లతో పాటు జిల్లాల స్వరూపమూ కొంత మార్చింది. హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజిన్లతో హన్మకొండ, వరంగల్, నర్సంపేట రెవెన్యూ డివిజన్లతో వరంగల్ జిల్లాను ఏర్పాటు చేస్తూ ఈ రోజు రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్ విడుదలైంది. ఇవ్వాళ్టి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని సీఎం సోమేశ్ కుమార్ విడుదల చేసిన నోటిఫికేషన్ పేర్కొంది. ఈ నిర్ణయంతో ఆయా జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఎన్నికైన బాడీల్లో ఎలాంటి మార్పులు జరగబోవని వివరించింది.

హన్మకొండ జిల్లాలో 14 మండలాలు, వరంగల్ జిల్లాలో 13 మండలాలున్నాయి. ఇది వరకు వరంగల్ అర్బన్‌లో ఉన్న హన్మకొండ, ఖాజీపేట్, ఐనవోలు, హసన్‌పర్తి, వేలేర్, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాలతోపాటు వరంగల్ రూరల్‌లో ఉన్న పర్కాల్, నదికూడ, దామెర, ఆత్మకూర్, శాయంపేట్‌లూ హన్మకొండ జిల్లా పరిధిలోకి వచ్చాయి. కాగా, ఇది వరకు వరంగల్ అర్బన్‌లో ఉన్న వరంగల్, ఖిలా వరంగల్‌తోపాటు వరంగల్ రూరల్‌లోని సంగెం, గీసుగొండ, వర్ధన్నపేట్, పర్వతగిరి, రాయపర్తి, నర్సంపేట్,  చెన్నారావుపేట్, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్, నెక్కొండ మండలాలు వరంగల్ జిల్లా పరిధిలోకి చేరాయి.

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు