తెలంగాణలో బిజెపికి ఓట్లు... కాంగ్రెస్ కు సీట్లు... బిఆర్ఎస్ పాట్లు తప్పవు..: పీపుల్స్ పల్స్ సర్వే

By Arun Kumar P  |  First Published Feb 20, 2024, 1:19 PM IST

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగనుందా..? దేశవ్యాప్తంగా మోదీ గాలి వీచినా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ సత్తా చాటనుందా..? బిజెపికి గణనీయంగా ఓట్లు పెరిగినా సీట్లు మాత్రం పెరగవా? బిఆర్ఎస్ పరిస్థితి మరింత దారుణంగా మారనుందా..? అంటే అవుననే అంటోంది ఓ ఎన్నికల సర్వే సంస్థ.  


హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతుందని సర్వేలు చెబుతున్నాయి. లోక్  సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బిజెపి సత్తాచాటినా   తెలంగాణలో మాత్రం అత్యధిక ఎంపీ సీట్లు హస్తంపార్టీ హస్తగతం అవుతాయని సర్వేసంస్థలు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై నమ్మకంతో వున్నారని... అది లోక్ సభ ఎన్నికల్లో మరోసారి బయటపడతుందని అంటున్నారు. ఇలా పీపుల్స్ ఫల్స్ - సౌత్ ఫస్ట్ సర్వే సంస్థ తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితం ఎలా వుండనుందో ప్రకటించింది. 

తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఓట్లు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని పీపుల్స్ సర్వే తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల కంటే 9 శాతం ఓట్లు ఎక్కువగా వచ్చినా సీట్లు మాత్రం  ఏమాత్రం పెరక్కపోగా ఇప్పుడున్నవాటికంటే తగ్గిపోవచ్చని తెలిపారు. తెలంగాణలో బిజెపికి 23 శాతం ఓట్లు...  2 నుండి 4 ఎంపీ సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. 

Latest Videos

ఇక అధికార కాంగ్రెస్ కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్ సభ ఎన్నికల్లో స్వల్పంగా ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటుందని ప్రకటించారు. 40 శాతం ఓట్లతో కాంగ్రెస్ ఏకంగా 8 నుండి 10 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందట.మోదీ హవా, బిజెపి హిందుత్వ పాలిటిక్స్ తెలంగాణలో పెద్దగా పనిచేయబోవని పీపుల్స్ పల్స్ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నారు.  

Also Read  టార్గెట్ పార్లమెంట్ ఎన్నికలు: తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు

ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న బిఆర్ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లోనూ పరాభవం తప్పదని పీపుల్స్ సర్వే తేల్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లు బిఆర్ఎస్ కు రావని... 6 శాతం కోల్పోతుందని తెలిపారు. మొత్తంగా 31 శాతం ఓట్లతో బిఆర్ఎస్ కేవలం 3 నుండి 5 ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకునే అవకాశం వుందని పీపుల్స్ పల్స్ - సౌత్ ఫస్ట్ సర్వే వెల్లడించింది.  

 తెలంగాణ మహిళల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పెరిగిందని... 47 శాతం మంది ఆ పార్టీకి అనుకూలంగా ఓటేసేందుకు సిద్దంగా వున్నట్లు సర్వే రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఇక పురుషుల్లో 37 శాతం మాత్రమే కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 42, అర్భన్ ప్రాంతాల్లో 37 శాతంమంది ప్రజలు కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్లు పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. 
 

click me!